టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘మ్యాడ్ స్క్వేర్’. 2023లో వచ్చిన సూపర్ హిట్ మూవీ మ్యాడ్ సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కింది.
నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కల్యాణ్శంకర్ దర్శకుడు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించారు. భారీ అంచనాల మధ్య మార్చి 28న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయ్యింది. ఇటీవలే ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా సక్సెస్ సెలెబ్రేషన్స్ ని నిర్వహించారు
ఇప్పుడు మాడ్ స్క్వేర్ నుండి ‘బాలు గాని ఇంటిలోన’ వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

