కెప్టెన్ గా ధోని గత రికార్డు లు తెలుసా?

by | Apr 11, 2025 | వార్తలు

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీల్ 2025 లో మిగతా మ్యాచ్ లకు దూరమయ్యాడు.  ఈ నేపథ్యంలో యాజమాన్యం 43 ఏళ్ళ ధోని చేతికి పగ్గాలు ఇచ్చింది.  ఈ సందర్భంగా కెప్టెన్ గా ఐపీల్ లో ధోని గత రికార్డు లు ఎలా ఉన్నాయి చూద్దామా

ఐపీల్ లో అత్యధిక మ్యాచ్ లకు నాయకత్వం వహించిన కెప్టెన్ గా ధోని రోహిత్ శర్మ తో కలిసి నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 226 మ్యాచ్ లకు సారధ్యం వహించారు.  ఈ రోజు కె కె ఆర్ తో  జరగబోయే మ్యాచ్ తో ధోని నెంబర్ వన్ అవుతారు

అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ ధోని నే. ఇప్పటివరకు కెప్టెన్ గా 133 మ్యాచ్ ల్లో జట్టు ని గెలిపించాడు.  ధోని తరవాత రోహిత్ శర్మ 87 మ్యాచ్ లు, గంభీర్ 71, విరాట్ కోహ్లీ 66 మ్యాచ్ లలో తమ జట్టును గెలిపించారు

కెప్టెన్ గా ధోని గెలుపు శాతం సుమారు 60 గా ఉంటుంది. రోహిత్ శర్మ 56%, గంభీర్ 55% తో తరవాతి స్థానాలలో ఉన్నారు

కెప్టెన్ గా ఎక్కువ సిక్సలు కొట్టిన ఆటగాడు కూడా ధోని నే. ఇప్పటివరకు ధోని కెప్టెన్ గా 216 సిక్సలు కొట్టాడు. 168 సిక్స్ లతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తరవాతి స్థానాలలో ఉన్నారు.

ధోని మెరుపు స్టంపింగ్స్, మెరుపు వేగంతో అందుకునే క్యాచ్ లు మనం చూశాం. ఇప్పటివరకు 195 మందిని అవుట్ చేయడంలో కీపర్ గా ధోని కీలక పాత్ర పోషించాడు

కెప్టెన్ గా ఐపీల్ లో ఎక్కువ పరుగులు చేసిన వారి జాబితాలో ధోని రెండవ స్థానంలో ఉన్నాడు. కెప్టెన్ గా ధోని 4660 పరుగులతో రెండవ స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 4994 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

వరుస ఓటములతో డీలా పడిన చెన్నై సూపర్ కింగ్స్ ని , ధోని మళ్ళీ గెలుపు బాట పట్టిస్తాడా లేదా అనేది చూడాలి. ధోని ఫాన్స్ , గెట్ రెడీ