‘చావా’ ఓ టి టి లో విడుదల ఈ రోజే

by | Apr 10, 2025 | టీవీ & ఓటిటి

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన తాజా చిత్రం ‘ఛావా’. ఇందులో నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్నా కథానాయికగా న‌టించ‌గా.. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌హరాష్ట్ర యోధుడు ఛ‌త్ర‌పతి శివాజీ మ‌హ‌రాజ్ కొడుకు శంభాజీ మ‌హరాజ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా వ‌చ్చింది. విక్కీ కౌశ‌ల్ ఇందులో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయ‌న భార్య యెసుబాయ్ పాత్ర‌ను ర‌ష్మిక మందన్నా పోషించారు.

చావా సినిమాను ఏప్రిల్ 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లుగా ఎక్స్ లో ప్రకటించారు. థియేటర్ లో చూడని వారు ఓ టి టి లో చూసేయండి.

తెలుగు ప్రేక్షకుల డిమాండ్ మేరకు చావా సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు.  తెలుగులో కూడా చావా సుమారు 12 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు సమాచారం.

ఇక ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో, నెల రోజులు దాటినా కూడా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దింతో 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడంతో పాటుగా విక్కీ కౌశల్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.