‘AA22’: బన్నీ కోసం ఇద్దరు హీరోయిన్లు.. అట్లీ సెలక్షన్ అదుర్స్

by | Apr 10, 2025 | సినిమా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న సినిమాపై అధికారికంగా ప్రకటన విడుదల చేశారు మేకర్స్. ‘A22 x A6’గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ భారీ ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలుస్తోంది. కోలీవుడ్‌ దిగ్గజ సినీ నిర్మాణ సంస్థ ‘సన్‌ పిక్చర్స్‌'(Sun Pictures) కళానిధి మారన్ సమర్పణలో రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ పని చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అయితే ఈ చిత్రంలో కథానాయికగా గ్లోబల్ స్టార్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కథానాయికగా ఎంపికైనట్లు వార్తలొచ్చాయి.

తాజాగా మరో వార్త వైరల్‌ అవుతోంది. టాలీవుడ్ గ్లామర్‌ డాల్‌ సమంత (Samantha) కూడా ఈ చిత్రంలో భాగం కానుందట. అయితే ఆమె హీరోయిన్ గానా, లేక ప్రత్యేక పాత్రలో కనిపించనుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. అంతకుముందు ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించింది సమంత. ఆ తర్వాత ‘పుష్ప’లో స్పెషల్ సాంగ్ లోనూ బన్నీతో స్టెప్పులేసింది. ఒకవేళ ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా ఫిక్స్ అయితే ఇది వాళ్లిద్దరికి హ్యాట్రిక్‌ ప్రాజెక్టు కానుంది. కాగా, బన్నీ, అట్లీ (Atlee) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సైంటిఫిక్‌ తరహాలో, ఏలియన్స్‌, గ్రహాంతరవాసుల నేప‌థ్యంలో రూపొంద‌నుంద‌ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తమిళ్‌లో మెర్సల్‌, తేరి, బిగిల్‌ సినిమాలతో పాటు బాలీవుడ్‌లో జవాన్‌ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అట్లీ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ తో సినిమా చేయనుండడంతో వీరిద్దరూ బాక్సఫీస్ రికార్డులు బద్దలుకొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, త్వరలోనే ఈ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.