పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్‌ : వృద్ధి సినిమాస్ Thank You నోట్

by | Apr 9, 2025 | సినిమా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ఫస్ట్ షాట్ కి వచ్చిన స్పందనకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న వృద్ధి సినిమాస్ వెంకట సతీష్ కిలారు thank you నోట్ ని విడుదల చేశారు

మీరందరు ఆనందించేలా ఒక గొప్ప సినిమాని తీసుకొస్తాము.  వెండి తెరపై ఒక ఎపిక్ డ్రామా ని మార్చ్ 27, 2026 న మీ ముందుకు తీసుకు వస్తామని, ఇదే మా వాగ్దానం.

రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పెద్ది’. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుంది. రూరల్ బ్యాగ్డ్రాప్ లో క్రికెట్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన వీడియో గ్లింప్స్ ప్రేక్షకులకు అలరిస్తోంది. అంతేకాకుండా టాలీవుడ్​లో సరికొత్త రికార్డ్స్​ను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే నెట్టింట వీరవిహారం చేస్తున్న పెద్ది గ్లింప్స్ కు సంబంధించిన వార్త ఒకటి టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. పెద్ది గ్లింప్స్‌ విడుదల చేసిన 24 గంటల్లోనే 37 మిలియన్ల వ్యూస్‌ రాబట్టి.. మోస్ట్‌ వ్యూవ్డ్ గ్లింప్స్‌గా ఆల్ టైమ్‌ రికార్డును క్రియేట్‌ చేసింది. ఈ గ్లింప్స్‌ ఇప్పటికే 550K పైగా లైక్స్‌ రాబట్టిందంటే రామ్ చరణ్ మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

https://twitter.com/vriddhicinemas/status/1909820400130728379