‘కన్నప్ప’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

by | Apr 9, 2025 | సినిమా

టాలీవుడ్ స్టార్ హీరో విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను చిత్ర బృందం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్‌ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 25న విడుదల కావాల్సి ఉండగా.. వీఎఫ్‌ఎక్స్‌ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ఇటీవలే ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ను చిత్ర బృందం అఫీషియల్​గా ప్రకటించింది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ‘కన్నప్ప’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని మోహన్ బాబు, మంచు విష్ణు, ప్రభు దేవతో పాటుగా కన్నప్ప చిత్ర బృందం కలిశారు. ఈ సందర్భంగానే కన్నప్ప కొత్త విడుదల తేదీని ప్రకటించారు. దీనిపై మంచు అభిమానులతో పాటుగా సినీప్రియులు ఆనందం హర్షం చేస్తున్నారు.

కాగా, కన్నప్ప సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రైలర్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ‘కన్నప్ప’ మూవీలో ఈ చిత్రంలో భారతీయ చిత్ర పరిశ్రమల్లో పేరొందిన ఎందరో నటీనటులు భాగమాయ్యరు. ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడిగా హీరోయిన్ పాత్రలో ‘ఓం భీమ్ బుష్’ ఫేమ్ ప్రీతి ముకుందన్ నటిస్తోంది. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ పార్వతీ దేవిగా అలరించబోతున్నారు. అలానే మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, శివ బాలాజీ, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)ఈ సినిమాలో రుద్ర పాత్రను పోషించారు. కాగా, పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్‌ దేవస్సే, తెలుగు సంగీత దర్శకుడు మణిశర్మ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.