‘పెద్ది’ vs ‘ఓజీ’ ఆల్​టైమ్​ రికార్డ్.. దటీజ్ మెగా మేనియా

by | Apr 7, 2025 | సినిమా

రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పెద్ది’. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుంది. రూరల్ బ్యాగ్డ్రాప్ లో క్రికెట్‌ (Cricket) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన వీడియో గ్లింప్స్ ప్రేక్షకులకు అలరిస్తోంది. అంతేకాకుండా టాలీవుడ్​లో సరికొత్త రికార్డ్స్​ను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే నెట్టింట వీరవిహారం చేస్తున్న పెద్ది గ్లింప్స్ కు సంబంధించిన వార్త ఒకటి టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. పెద్ది గ్లింప్స్‌ విడుదల చేసిన 24 గంటల్లోనే 37 మిలియన్ల వ్యూస్‌ రాబట్టి.. మోస్ట్‌ వ్యూవ్డ్ గ్లింప్స్‌గా ఆల్ టైమ్‌ రికార్డును క్రియేట్‌ చేసింది. ఈ గ్లింప్స్‌ ఇప్పటికే 550K పైగా లైక్స్‌ రాబట్టిందంటే రామ్ చరణ్ (Ram Charan) మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలాఉంటే.. అంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా మోస్ట్‌ లైక్‌డ్‌ గ్లింప్స్‌గా సోషల్ మీడియాలో ఇప్పటికీ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఈ గ్లింప్స్ 24 గంటల్లోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్​ లైక్డ్​గా గ్లింప్స్​గా రికార్డ్​ సాధించిన సంగతి తెలిసిందే. ఓజీ గ్లింప్స్ విడుదల చేసిన 24 గంటల్లోనే 16 మిలియన్ వ్యూస్‌కు పైగా దక్కించుకుంది. అలాగే, 731K లైక్స్​కు పైగా సొంతం చేసుకుంది.

గతంలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్‌ 728.5K లైక్స్‌తో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇలా మోస్ట్‌ వ్యూవ్డ్ గ్లింప్స్‌గా అబ్బాయ్ రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi) మూవీ దూసుకెళ్తుండగా.. మోస్ట్​ లైక్డ్​గా గ్లింప్స్​గా బాబాయ్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా కొనసాగుతోంది. ఇక పెద్ది సినిమాను కుస్తీతో పాటు క్రికెట్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. క‌న్న‌డ నటుడు శివరాజ్‌కుమార్, దివ్యేండు శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా యువ దర్శకుడు సుజీత్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘ఓజీ’ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.