యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. భారీ బడ్జెట్ తో యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇదిలాఉంటే.. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన వార్ 2 గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. కాగా, యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో 6వ చిత్రంగా, 2019లో వచ్చిన ‘వార్’ సీక్వెల్ గా ‘వార్ 2’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉండే స్పై ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. హై ఇంటెన్సిటీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలాఉంటే.. తాజాగా హృతిక్ రోషన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో నటించిన అనుభవాలను పంచుకున్నారు.
ఈ నేపథ్యంలోనే హృతిక్ రోషన్ (Hrithik Roshan) తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు..” వార్ మూవీ సీక్వెల్ ఎలా ఉంటుందోనని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఈ సినిమా ఔట్ పుట్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ వంటి గొప్ప నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గర్వంగా ఉంది. వార్ 2 సినిమాలో ఒక సాంగ్ తప్ప మిగిలిన చిత్రీకరణ మొత్తం పూర్తయింది. అయితే ఆ సాంగ్ లో ఎన్టీఆర్ (NTR) తో కలిసి స్టెప్పులు వేయాలంటే చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఎలాగైనా డ్యాన్స్ చేయగలడు. అతని గ్రేస్ అందుకోవడం అసాధ్యం. నేను ఎన్టీఆర్ డ్యాన్స్ ను అందుకునేందుకు ప్రయత్నిస్తాను. మీరు మా వార్ 2 (WAR) సినిమాను విజయవంతం చేయాలి అని హృతిక్ రోషన్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇటీవలే విడుదల తేదీని ప్రకటించారు. వార్ 2 సినిమాను ఆగష్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు.

