గతేడాది ‘పుష్ప2’ సినిమాతో కెరీర్లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లని ఓకే చేశాడు. ఇందులో త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనుండగా, తమిళ డైరెక్టర్ అట్లీతో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్ లో హై యాక్షన్ మూవీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తుండగా.. అట్లీ అల్లు అర్జున్ (Allu Arjun) కోసం చాలా స్పెషల్ గా ఈ పాత్రని డిజైన్ చేస్తున్నాడట. దీని ప్రకారం ఈ చిత్రం ఇంటర్నేషనల్ లెవెల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం యావత్ దేశమంతా ఎదురుచూస్తోంది. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. అయితే ఈ మూవీ అప్డేట్ కోసం అల్లు అర్జున్ అభిమానులతో పాటుగా సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ (Sun Pictures) ట్విట్టర్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ఒక సాలిడ్ అప్డేట్ త్వరలోనే రాబోతుందని ఈ ట్వీట్ చూస్తుంటే తెలుస్తోంది. మాస్ ని మ్యాజిక్ మీట్ అయితే ఎలా ఉంటుందో చూస్తారు అన్నట్టుగా చేసిన పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టుపై ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా.. చిత్ర బృందం ఓ స్పెషల్ వీడియోతో సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదిలాఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం గ్లోబల్ స్టార్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తునందుకు గానూ బన్నీ ఏకంగా రూ.175 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రలో తమిళ స్టార్ హీరో అమరన్ ఫేమ్ శివకార్తికేయన్ (Siva Karthikeyan) నటించనున్నట్లు తెలుస్తోంది.


