ముంబై ఇండియన్స్ కు గుడ్ న్యూస్

by | Apr 6, 2025 | వార్తలు

ముంబై ఇండియన్స్ కు గుడ్ న్యూస్. ఇండియన్ స్టార్ పేసర్ బుమ్రా వచ్చి జట్టులో చేరబోతున్నాడు.  బోర్డర్, గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ మ్యాచ్ నుండి ఆటకు దూరంగా ఉన్న బుమ్రా వెన్ను నొప్పి నుంచి కోలుకుని తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులు చేరబోతున్నాడు.

ఈ ఐపీల్ 2025 లో నాలుగు మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు ఒక్క మ్యాచ్ లో గెలిచి, మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు బుమ్రా రాకకోసం ఎదురు చూస్తోంది

ప్రస్తుతానికి ముంబై ఇండియన్స్ పేస్ విభాగం లో హార్దిక్ పాండ్య, దీపక్ చాహార్ లు ఉన్నారు. అయితే దీపక్ చాహర్ విఫలమవుతున్నాడు. హార్దిక్ పాండ్య గత మ్యాచ్ లో ఐదు వికెట్లు తీశాడు. బుమ్రా ఉంటె పవర్ ప్లే, డెత్ ఓవర్ల లో పరుగులు నియంత్రించడమే కాకుండా వికెట్లు తీసి ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెడతాడు

ముంబై ఇండియన్స్ తన తరవాతి మ్యాచ్ ఏప్రిల్ 7 న రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తో తలపడనుంది. అయితే ఏప్రిల్ 17 న సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ కు బుమ్రా అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది.

https://twitter.com/mipaltan/status/1908750039070941372