వైల్డ్‌ లుక్‌లో రామ్‌చరణ్‌ ‘పెద్ది’ గ్లింప్స్ రిలీజ్

by | Apr 6, 2025 | సినిమా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చిత్ర యూనిట్ మెగా అభిమానులకు అదిరిపోయే కానుక అందించింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీరామిన‌వ‌మి కానుక‌గా ‘పెద్ది’ నుంచి ఫ‌స్ట్ షాట్‌ గ్లింప్స్ విడుదల చేసింది. ఈ వీడియో చూస్తుంటే.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. 1.04 నిమిషాల పాటే ఉన్నప్పటికీ ఈ గ్లింప్స్ అదిరిపోయింది.

ఈ గ్లింప్స్ చూస్తుంటే పెద్ది సినిమాతో మెగా అభిమానులను ఫుల్ మీల్స్ ఖాయమని అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ గ్లింప్స్ ము ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ కాబోతుందని గ్లింప్స్‌‍లో ప్రకటించారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. క‌న్న‌డ నటుడు శివరాజ్‌కుమార్, దివ్యేండు శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.