‘హిట్‌ 3’లో బిగ్ సర్‌ప్రైజ్‌.. విడుదలకు ముందే లాభాల్లోకి!

by | Apr 5, 2025 | సినిమా

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శైలేశ్‌ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘హిట్‌’: ది థర్డ్‌ కేస్‌’ ఫుల్ లెంగ్త్ క్రైమ్‌ థ్రిల్లర్​గా రూపొందనున్న ఈ మూవీలో అర్జున్‌ సర్కార్‌ అనే ఓ పవర్​ఫుల్ పోలీస్ ఆఫీసర్​గా నాని కనిపించనున్నారు. కఠినత్వానికీ, కనికరం లేని తత్వానికి ప్రతీకగా ఆయన పాత్ర సాగుతుందని, ఇప్పటి వరకు నాని పోషించిన పాత్రలతో పోల్చితే ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ఈ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని అందించేలా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హిట్ 3 సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi) స్పెషల్ రోల్ చేయనున్నట్లు సమాచారం. నిజానికి ‘హిట్‌ 2’లో నాని (Nani) కనిపించినట్టే హిట్‌ 3లో హీరో అడివి శేష్, విశ్వక్‌సేన్‌ కూడా కనిపించాల్సి ఉంది. అయితే అడవి శేష్‌ రెడీగా ఉన్నప్పటికీ, విశ్వక్‌సేన్‌ మాత్రం సిద్ధంగా లేడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే హిట్‌ 2లో చూపించినట్లే హిట్ 3 క్లైమాక్స్‌ లో ‘హిట్‌ 4’ లో నటించే హీరో ఎవరు అనేది రివీల్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ హీరో కార్తీ ‘హిట్‌ 4’ లో హీరోగా చేయనున్నట్లు సమాచారం. దీన్ని ‘హిట్‌ 3’ చివర్లో రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మూవీ క్లైమాక్స్ లో కార్తీ ఎంట్రీ ఉంటుందని సమాచారం.

ఇదిలాఉంటే.. హిట్ 3 సినిమా విడుదలకు ముందే సెన్సేషనల్ ప్రీ బిజినెస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా రూ.60కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా విడుదలకు ముందే లాభాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. హిట్ 3 మూవీ ఓటీటీ రైట్స్ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ రూ.54 కోట్లకు కొనుగోలు చేయగా.. ఈ మూవీ ఆడియో రైట్స్ రూ.6కోట్లుకు అమ్ముడుపోయాయి. దింతో ఇక్కడికే రూ.60కోట్లు హిట్ 3 ఖాతాలో చేరాయి. ఇక హిట్ 3 సినిమా థియేట్రికల్ రైట్స్‌కి భారీగా డిమాండ్ ఏర్పడింది. వీటితో పాటుగా హిందీ డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ద్వారా ఈ చిత్రానికి కళ్లెచేదిరే కలెక్షన్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. హిట్ 3 (HIT) సినిమా వేసవి కానుకగా మే 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.