డబ్బు సంపాదించడం ఒక కళ. సంపాదించిన డబ్బును దాచుకోవడం ఒక కళ. ఆ దాచుకున్న సంపదతో మరింత సంపదను సృష్టించడం ఒక కళ
అయితే సంపాదనను ఇన్వెస్ట్ చేసే అవకాశాలు, సంపదను వృద్ధి చేసే మార్గాల గురించి తెలుసుకుందాం
వారెన్ బఫెట్ చెప్పిన మనీ సూత్రాలు ఏంటో చూద్దాం
- ముందుగా చిన్న చిన్న మొత్తాలు సేవింగ్ చేయడం నేర్చుకోవాలి.
- మీరు ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు ఒకటికి, పది సార్లు ఆలోంచించడి. ఈ వస్తువు మీకు అవసరమా, లేదా మీకు కావాలనిపిస్తోందా. అవసరమైతేనే ఆ వస్తువు మీద ఖర్చు పెట్టండి. దాని రిటర్న్స్ మీకు ఏదో ఒక రూపంలో ఎంతకాలం అందుతాయి అన్ని విషయాలు బేరీజు వేసుకుని మరి ఖర్చు పెట్టండి. ఆస్తులు కూడబెట్టడం అంటే సంపాదించడమే కాదు పొదుపు చేయడం, అనవసర ఖర్చు తగ్గించడం కూడా
- మీ మీద మీరు ఖర్చు పెట్టుకోండి. మీ నాలెడ్జి ని మెరుగుపరుచుకోవడానికి ఖర్చు పెట్టండి. దీర్ఘ కాలంలో వాటి ఫలాలు అందేలా ఉండాలి. అంటే మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వంటివి
- ఇప్పుడే, ఈ రోజు నుండే సంపద సృష్టించడం, సంపదను సేవింగ్ చేయడం గురించి ఆలోచించడం మొదలు పెట్టండి.
2025 లో టాప్ 10 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. వీటిలో రిస్క్ అధికంగా ఉన్నవి, తక్కువగా ఉన్నవి రకరకాలు ఉంటాయి
మొదటిది మీకు ఆడపిల్లలు ఉంటె అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ సుకన్య సమృద్ధి యోజన. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పధకాన్ని తీసేసే సాహసం చేయరు.
పోస్ట్ ఆఫీస్ లో కానీ, నేషనలైజ్డ్ బ్యాంకు లో మీ ఆడ పిల్లల మీరు మీద ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. 2015 లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు భేటీ బచావో భేటీ పడావో పధకంలో భాగంగా ఆడపిల్లల చదువుకు, పెళ్ళికి అక్కరకు వచ్చే అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఈ సుకన్య సమృద్ధి.
సంవత్సరానికి కనీసం 250 రూపాయలు అధికంగా లక్ష యాభై వేల రూపాయలు ఈ అకౌంట్ లో డిపాజిట్ చేసుకోవచ్చు. 8% వడ్డీ గ్యారంటీ. రిస్క్ ఉండదు. కేంద్ర ప్రభుత్వ పధకం
ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ లో 15 సంవత్సరాలపాటు డిపాజిట్ చేసుకోవచ్చు. ఆడపిల్లకు 21 ఏళ్ళు వచ్చాక ఈ అకౌంట్ నుండి మనీ తీసుకోవచ్చు లేదా 18 దాటిన తరవాత ఆడపిల్ల పెళ్లికి కొంత మనీ తీసుకోవచ్చు
పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ పధకం
సంవత్సరానికి కనీసం 500 రూపాయలు అధికంగా లక్ష యాభై వేల రూపాయలు ఈ అకౌంట్ లో డిపాజిట్ చేసుకోవచ్చు. 15 సంవత్సరాల తరవాత అకౌంట్ లో మనీ తీసుకోవచ్చు. కావాలంటే మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు
పోస్ట్ ఆఫీస్ లో కానీ, నేషనలైజ్డ్ బ్యాంకు ల్లో గాని ఈ పి పి ఎఫ్ ఆకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఈ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. దీనిపై 7.1% వడ్డీ లభిస్తుంది.
కిసాన్ వికాస్ పత్ర
కిసాన్ వికాస్ పత్ర ఖాతాను కూడా ఏదైనా పోస్ట్ ఆఫీస్ లో గాని, నేషనలైజ్డ్ బ్యాంకు లో గాని ఓపెన్ చేసుకోవచ్చు
ఇందులో కనీసంగా 1000 తో ఖాతా ప్రారంభించుకోవచ్చు. అక్కడనుండి ఎంతైనా వేసుకోవచ్చు. పరిమితులు ఏమి లేవు
కిసాన్ వికాస్ పాత్రలో మీరు డిపాజిట్ చేసిన సొమ్ము రెట్టింపు అవుతుంది. ఎప్పుడు మెచూరిటీ అవుతుంది అనేది పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు వాళ్ళు అప్పటి వడ్డీ రేటు ప్రకారం చెపుతారు. ఉదాహరణకు మీరు ఈ ఖాతాలో 1000 రూపాయలు వేస్తే 2000 అవుతుంది. అదే మీరు ఈ ఖాతాలో 10 లక్షలు వేస్తే 20 లక్షలు అవుతుంది. మీ సొమ్ము రెట్టింపు కావడానికి సుమారుగా 10 సంవత్సరాలు పడుతుంది
వడ్డీ 7.5% వడ్డీ ఉంటుంది. ప్రభుత్వ పధకం. రిస్క్ ఉండదు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్
పోస్ట్ ఆఫీస్ లలో మాత్రమే ఈ పధకం లో ఇన్వెస్ట్ చేయవచ్చు. కనీసం మొత్తం 1000 రూపాయలు. ఆ పైన్ మీరు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. 5 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఇది 5 సంవత్సరాల ఫిక్సడ్ డిపాజిట్ లా పని చేస్తుంది
ఇందులో వడ్డీ 7.7% ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పధకం. రిస్క్ తక్కువ
డైరెక్ట్ ఈక్విటీ, ఈక్విటీ మ్యూచవల్ ఫండ్స్
వీటిలో కనీస పెట్టుబడులు, లాక్ ఇన్ పీరియడ్ లు అలాంటివేమీ ఉండవు. అయితే డి మాట్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి.
ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. అయితే మార్కెట్ కండిషన్స్ ను బట్టి మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. రిస్క్ అధికంగా ఉంటుంది.
పాపులర్ ఫండ్స్ 12-20% వరకు రిటర్న్ ఇస్తుంది. వీటి మీద వచ్చే ఆదాయం పై టాక్స్ కట్టాలి. మార్కెట్ పరిస్థితులను బట్టి మీ రిటర్న్స్ ఉంటాయి. ఇలాంటి వాటి మీద ఆసక్తి ఉన్న వాళ్లకు మాత్రమే ఈ ఇన్వెస్ట్ మెంట్
యులిప్స్
ఇది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఏదైనా లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీ ద్వారా ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టవచ్చు. లైఫ్ ఇన్సూరెన్సు తో పాటు ఇన్వెస్టుమెంట్ ప్లాన్. రిస్క్ అధికంగానే ఉంటుంది.
ఇవే కాకుండా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఓపిక, నెట్వర్క్ ఉంటె స్థలాలలో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే మార్కెట్ ధర గురించి పూర్తి అవగాహన ఉండాలి. కొనుగోలు, అమ్మకాల లావాదేవీల మీద పట్టు ఉండాలి. అప్పుడే రియల్ ఎస్టేట్ రంగంలో దిగాలి
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (REITs) ద్వారా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు అధికంగానే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు ఆయినా ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే రిస్క్ ఎక్కువగానే ఉంటుంది
సోవరిన్ గోల్డ్ బాండ్స్
రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా వారు జారీ చేసే బాండ్లు ఇవి. ఫిజికల్ గోల్డ్ కొనలేని వారు, ఇలాంటి పథకాలలో పెట్టుబడి పెట్టచ్చు. దీనిమీద అప్పటి గోల్డ్ రేట్ ప్రకారం రిటర్న్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు లలో ఈ సోవరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు
ఒక ఆర్ధిక సంవత్సరంలో, కనీస పెట్టుబడి ఒక గ్రాము గోల్డ్ ధర నుండి నాలుగు కిలోల బంగారం ధర వరకు ఈ బాండ్ల లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ట్రస్ట్ లు మాత్రం 20 కిలోల బంగారం వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. లాక్ ఇన్ పీరియడ్ 8 సంవత్సరాలు. ప్రతి 6 నెలలకు 2.5% వడ్డీ ఇస్తారు. రిస్క్ ఉంటుంది. ఏ కారణం చేతగాని, ఫిజికల్ గోల్డ్ కొనలేని వారు ఈ సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు
బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. వాడి సుమారు 6.5% నుండి 7.5% వరకు ఉండచ్చు. బ్యాంక్స్ లో ఫిక్స్ డ్ డిపాజిట్స్ 10 సంవత్సరాలకు చేసుకోవచ్చు. బ్యాంకు లో లాగా పోస్ట్ ఆఫీస్ లో కూడా టైం డిపాజిట్స్ పధకాలు ఉంటాయి. ఇందులో 6.5% తో 7.5% వరకు వడ్డీ ఉండవచ్చు. ఒక సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ రెండింటిలో రిస్క్ తక్కువగా ఉంటుంది
ఇంకా సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం, నేషనల్ పెన్షన్ సిస్టం లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు

