కింగ్ స్టన్ మూవీ ఓ టి టి, టెలివిజన్ ప్రీమియర్ ఈ రోజే

by | Apr 3, 2025 | సినిమా

సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ కుమార్, దివ్య భారతి హీరో, హీరోయిన్ లుగా నటించిన చిత్రం కింగ్ స్టన్

సముద్రం మీద జరిగే  అడ్వెంచర్ మూవీ కింగ్ స్టన్ గత నెలలోనే థియేటర్ లో విడుదలయింది.  సినిమా పరవాలేదనిపించినా థియేటర్ లో ఆశించిన ఫలితం రాలేదు.  ఇప్పుడు ఈ సినిమా టెలివిజన్ లోను, ఓ టి టి లోను కనువిందు చేయనుంది.

ఏప్రిల్ 13 న జీ తమిళ్ ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానున్న ఈ సినిమా అదే రోజు జీ 5 లోను సందడి చేయనుంది.  జి 5 వారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు

దర్శకుడు కమల్ ప్రకాష్ తెరకెక్కించిన ఈ చిత్రం మత్సకారుల జీవితాలకు, సముద్ర తీర ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు సాగించే ముఠాకు మధ్య పోరాటం చేసే వాడే ఈ కింగ్ స్టన్.

అయితే ఈ కింగ్ స్టన్ మూవీ కేవలం తమిళ్ లోనే స్ట్రీమ్ అవుతుందా లేదా తెలుగులో కూడా అవుతుందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి జీ నెట్వర్క్ వారు ఈ కొత్త స్ట్రాటజీ ని తీసుకు వచ్చారు.  మూవీ ప్రీమియర్ ని టెలివిజన్ లో, ఓ టి టి లో ఒకే సారి చేస్తున్నారు. జీ కన్నడ లో సుదీప్ నటించిన మాక్స్ మూవీ ని కూడా ఇలాగే ప్రీమియర్ చేశారు