ఎమ్మెల్సీ నాగబాబు కు అన్న, వదినల అభినందనలు

by | Apr 2, 2025 | వార్తలు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు  శాసన మండలి సభ్యునిగా బుధవారం శాసన మండలి చైర్మన్ సమక్షంలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా నాగ బాబు ను అభినందించారు

ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడి (MLC) గా ప్రమాణస్వీకారం చేసిన తమ్ముడు నాగబాబు కి ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులతో – అన్నయ్య, వదిన… అంతే కాకుండా నాగబాబు ని పూలమాలతో సత్కరించి పెన్ గిఫ్ట్ గా ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ

ప్రమాణ స్వీకార అనంతరం నాగబాబు, ఆయన సతీమణి పద్మజ గారితో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి చంద్రబాబు ని కలిసి శాలువా కప్పి బొకే ఇచ్చారు.  చంద్రబాబు గారు కూడా నాగ బాబుని శాలువా కప్పి వెంకటేశ్వర స్వామి వారి చిత్ర పటాన్ని అందచేశారు.