RCB మ్యాచ్ : గుజరాత్ టైటాన్స్ విజయ లక్ష్యం 170 పరుగులు

by | Apr 2, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది

బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కు మొదటి నుండి అన్ని కష్టాలే.  ఫిల్ సాల్ట్ 14 పరుగులు, విరాట్ కోహ్లీ 7 పరుగులు, పడిక్కల్ 4 పరుగులు, కెప్టెన్ రజత్ పటిదార్ 12 పరుగులు చేసి అవుట్ అయ్యారు

42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ ని లివింగ్ స్టోన్, జితేష్ శర్మలు ఆదుకున్నారు.  వీరిద్దరూ ఐదవ వికెట్ కు 52 పరుగులు జోడించారు

33 పరుగులు చేసిన జితేష్ శర్మ అవుట్ అయ్యాక వచ్చిన క్రునాల్ పాండ్య కూడా వెంటనే అవుట్ అయ్యాడు. అయితే ఆ తరవాత వచ్చిన టిమ్ డేవిడ్ తో లివింగ్ స్టోన్ 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాక, 54 పరుగులు చేసిన లివింగ్ స్టోన్ 19 ఓవర్ రెండో బంతికి అవుట్ అయ్యాడు.

ఆఖర్లో టిమ్ డేవిడ్ ధాటిగా ఆడి 18 బంతుల్లో 32 పరుగులు చేసి, ఆర్సీబీ కి ఆ మాత్రం పోరాడే స్కోర్ అందించారు

ఆఖరి ఓవర్లో 16 పరుగులు చేసిన టిమ్ డేవిడ్ ఆఖరి బంతికి ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు

గుజరాత్ టైటాన్స్ బౌలర్ల లో సిరాజ్ మూడు వికెట్లు, సాయి కిషోర్ రెండు వికెట్లు తీశారు. అర్షద్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, ఇషాంత్ శర్మ లు తలా ఒక వికెట్ తీశారు

సిరాజ్ నాలుగు ఓవర్ల లో 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకోగా, సాయి కిశోర్ 22 పరుగులు ఇచ్చి రెండు  వికెట్లు తీశాడు