టాలీవుడ్ స్టార్ హీరో విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను చిత్ర బృందం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుండగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కాకపోవడంతో మరోసారి వాయిదా వేశారు మేకర్స్. వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతోందని త్వరలోనే కొత్త విడుదల ప్రకటిస్తామని మంచు విష్ణు వెల్లడించారు. కానీ తాజాగా ఈ సినిమా ప్రీమియర్ వేశారనే వార్తలు రాగా.. దీనిపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు.
కన్నప్ప మూవీ ప్రీమియర్ వేశారని వస్తున్న న్యూస్ లో ఎలాంటి వాస్తవం లేదు. మేము వీఎఫ్‌ఎక్స్ కు చెందిన 15 నిమిషాల ఫుటేజ్ క్వాలిటీని మాత్రమే చెక్ చేశాం ప్రస్తుతం. ‘కన్నప్ప’ మూవీ ఫస్ట్ కాపీని రెడీ చేసేందుకు పనిచేస్తున్నాం అభిమానులు దయచేసి ఇలాంటి రూమర్లు నమ్మొద్దు అని మంచు విష్ణు (Manchu Vishnu) చెప్పుకొచ్చారు. కాగా, మార్చి 31న ప్రసాద్ ల్యాబ్ నుంచి మంచు కుటుంబ సభ్యులు బయటికి వస్తున్న వీడియోలు బయటకు రావడంతోనే కన్నప్ప మూవీ ప్రీమియర్ వేశారనే వార్తలు వచ్చాయి. కాగా, కన్నప్ప సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రైలర్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడిగా హీరోయిన్ పాత్రలో ‘ఓం భీమ్ బుష్’ ఫేమ్ ప్రీతి ముకుందన్ నటిస్తోంది. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ పార్వతీ దేవిగా అలరించబోతున్నారు. అలానే మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, శివ బాలాజీ, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో రుద్ర పాత్రను పోషించారు.

