న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన రెండవ వన్ డే లో న్యూజిలాండ్ 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్ల లో 8 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది
న్యూజిలాండ్ కు ఓపెనర్ లు మరియూ, కెల్లీ లు మొదటి వికెట్ కు 54 పరుగులు జోడించారు. అయితే ఆ తరవాత పరుగులు వస్తున్నా న్యూజిలాండ్ వికెట్లు కోల్పోతూ వచ్చింది. 132 పరుగులకే 5 కోల్పోయిన న్యూజిలాండ్ ను మిచెల్ హే, ముముహమ్మద్ అబ్బాస్ లు ఆరవ వికెట్ కు 77 పరుగులు జోడించి ఆదుకున్నారు
అబ్బాస్ 41 పరుగులు చేసి అవుట్ అవగా, హే చివర వరకు నిలబడి 78 బంతుల్లో 7 సిక్సర్ లు, 7 ఫోర్ల సాయంతో 99 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచి, సెంచరీ కి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయాడు
పాకిస్థాన్ బౌలర్ల లో ముఖిమ్, వసీం లు రెండేసి వికెట్లు తీయగా, అష్రాఫ్, జావేద్, రాఫ్ లు తలా ఒక వికెట్ తీశారు
293 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లలో గెలిచే లక్షణాలు ఏ మాత్రం కనిపించలేదు. జట్టు మొత్తం ఫామ్ లో లేకపోవొడాన్ని ఏమనాలో తెలీదు
మొదటి ఐదుగురు ఆటగాళ్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేదు. పాకిస్థాన్ వికెట్ల పతనం ఎలా జరిగిందంటే 32 పరుగులకు 5 వికెట్లు, 65 పరుగులకు 6 వికెట్లు, 72 పరుగులకు 7 వికెట్లు …..ఇది వరస
అష్రాఫ్ 73 పరుగులు, నసీం షా 51 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మొదటి 10 మంది ఆటగాళ్లలో కేవలం ఇద్దరే రెండంకెల స్కోర్ చేశారు. చివరకు 41.2 ఓవర్ల లో 208 పరుగులకు అల్ అయ్యి, 84 పరుగుల తేడాతో ఓడిపోయింది
న్యూజిలాండ్ బౌలర్లలో ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ విన్నర్ సీర్స్ 5 వికెట్లు తీయగా, డఫీ మూడు వికెట్లు తీశాడు. ఒరూర్కే, నాథన్ స్మిత్ లు చెరో ఒక వికెట్ తీశారు

