ధనుష్ దర్శకత్వం వహించిన తమిళ్ చిత్రం నిలవుకు యెన్ యెల్ యెన్నడి కోబం చిత్రాన్ని తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా అని విడుదల చేశారు. అంత కొత్త వాళ్ళతో, రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుద్దిద్దుకున్న ఈ జాబిలమ్మ నీకు అంత కోపమా ను, యువతను లక్ష్యంగా చేసుకుని తీశారు. ఈ చిత్రానికి కధ, నిర్మాత, దర్శకుడు ధనుష్
ఫిబ్రవరి 21 న విడుదలైన ఈ సినిమాకు టాక్ బాగానే ఉన్నప్పటికీ, ఇదే సమయంలో ప్రదీప్ రంగనాధ్ నటించిన డ్రాగన్ సినిమా విడుదలయింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ధనుష్ సినిమా ప్లాప్ గా నిలిచింది.
అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తమిళంలో ఓ టి టి లో విడుదల చేశారు. ఇప్పుడు తెలుగులో కూడా జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాను చూడవచ్చు. అయితే అమెజాన్ ప్రైమ్ లోనే కాకుండా ఈ సినిమాలు సింప్లి సౌత్ అనే ఓ టి టి ప్లాట్ ఫామ్ లో కూడా చూడవచ్చు

