Mad Square Collection: నాలుగు రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లు?

by | Apr 1, 2025 | సినిమా

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వచ్చిన మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ‘మ్యాడ్ స్క్వేర్’. 2023లో వచ్చిన సూప‌ర్ హిట్ మూవీ మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కల్యాణ్‌శంకర్‌ దర్శకుడు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించారు. భారీ అంచనాల మధ్య మార్చి 28న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటిరోజే బాక్సాఫీస్‌ వద్ద రూ. 20.8 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి సెన్సేషనల్ రికార్డ్‌ సాధించగా… రెండు రోజుల్లో రూ. 37.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అలాగే మూడు రోజుల్లో రూ. 55.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక నాలుగో రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దుమ్మురేపుతోంది. నాలుగో రోజు ఏకంగా రూ. 3 53 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square Collections) సినిమా నాలుగు రోజుల షేర్ వసూళ్లను ప్రాంతాల వారీగా పరిశీలిస్తే..

★ నైజాం : 8.22కోట్లు,

★ సీడడ్ : 2.77 కోట్లు

★ ఉత్తర ఆంధ్ర – 2.41 కోట్లు

★ ఈస్ట్ గోదావరి : 1.44 కోట్లు

★ వెస్ట్ గోదావరి : 0.68 కోట్లు

★ గుంటూరు : 1.30 కోట్లు

★ కృష్ణ : 1.04 కోట్లు

★ నెల్లూరు : 0.58 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజైన సోమవారం రంజాన్ పండగతో పాటుగా సెలవు దినం కావడంతో రూ. 3.53 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమాకు మొదటి నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.44 కోట్లు షేర్ వసూళ్లు రాబట్టింది. ఇక దేశవ్యాప్తంగా ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ. 31.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ. 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఇక ఇక్కడే కాకుండా ఈ సినిమాకు ఓవర్సీస్​లోనూ దుమ్మురేపుతోంది. ఈ క్రమంలోనే మ్యాడ్ స్క్వేర్ మొదటి నాలుగు రోజుల్లోనే ఓవర్సీస్​లో వన్ మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.