రివ్యూలపై, సోషల్ మీడియా పోస్టుల పై నిర్మాత నాగవంశీ ఆవేదన

by | Apr 1, 2025 | సినిమా

మాడ్ స్క్వేర్ చిత్రాన్ని నిర్మించిన నాగ వంశీ ప్రెస్ మీట్ పెట్టారు. ఇంతకు ముందు పెంచిన టికెట్ ధరలను ఈ మంగళవారం నుండి సాధారణ రేట్లకు తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు

అంతే కాకుండా సినిమా రివ్యూల మీద కూడా కొంచెం గట్టిగా మాట్లాడారు. కంటెంట్ బాగుంటేనే సినిమా ఆడుతుంది.  సీక్వెల్ కదా అని ఆడడానికి మాడ్ స్క్వేర్ లో నటించిన వాళ్ళు పెద్ద హీరోలు కాదు. కోర్ట్ సినిమా కంటెంట్ బాగుంది కాబట్టే హిట్ అయ్యింది. సినిమా రివ్యూ లు రాసే వాళ్ళ మీద, సోషల్ మీడియా (Social Media) లో పోస్ట్ లు పెట్టె వారి మీద నిర్మాత నాగ వంశి (Naga Vamsi) ఆగ్రహం వ్యక్తం చేశారు

దమ్ముంటే నా సినిమాలను బాన్ చేయండి.  నా సినిమాల గురించి ఆర్టికల్స్ రాయకండి.  నా దగ్గర యాడ్స్ తీసుకోకండి.  నా సినిమాల మీద రివ్యూ రాయకండి అని ఆగ్రహంతో నాగవంశీ అన్నారు. నా సినిమా ఎలా ప్రోమోట్ చేసుకోవాలో నాకు తెలుసు. మీ వెబ్ సైట్స్ ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడడం లేదు కదా అని అన్నారు

నేను సినిమా తీస్తేనే మీ వెబ్ సైట్ రన్ అవుతుంది.  నేను ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యు ట్యూబ్ చానెల్స్ రన్ అవుతాయి.  నేను యాడ్ ఇస్తేనే మీ .  వెబ్ సైట్ రన్ అవుతుంది. అంతే కానీ సినిమాని చంపేయకండి

సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యాక ఎందుకు హిట్ అయ్యింది, ఎందుకు ఆడుతోంది అన్న మీ ఎనాలిసిస్ లు ఎవరికి అవసరం లేదు.

సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు. లేదంటే వెబ్ సైట్ మూసుకుని అందరు ఇంటికి వెళ్లాల్సి వస్తుంది

నిర్మాత నాగవంశీ ఆవేదనలో అర్థముంది. పాజిటివిటీ ని పెంచాల్సిన సోషల్ మీడియా ఇలా చేయడం బాధాకరం. నాగ వంశి బాధను అర్ధం చేసుకోవచ్చు