టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, బ్యూటీ క్వీన్ శ్రీలీల జంటగా యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించగా.. నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మాతలకుగా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రాహకుడిగా ఉన్నారు. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఉగాది పండుగ కానుకగా మార్చి 28న థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. అయితే ఈ సినిమాకు తొలి రోజు నుంచే బాక్సఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించింది. ఈ క్రమంలోనే రాబిన్‌హు(Robinhood) సినిమా బాక్సఫీస్ వద్ద దేశవ్యాప్తంగా మొదటి రోజున రూ. 2.30 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, రెండో రోజు రూ. 2.05 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అలాగే ఈ మూవీ మూడో రోజైన ఆదివారం సెలవు రోజు కావడంతో అత్యధికంగా రూ.2.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. నాలుగో రోజు కూడా రంజాన్ సెలవు రోజు కావడంతో రూ 1.04 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. మొత్తంగా మొదటి నాలుగు రోజుల్లో రాబిన్‌హుడ్ సినిమా దేశవ్యాప్తంగా రూ. 8.14 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది.
అయితే యూఎస్ మార్కెట్ లో ఈ సినిమా లక్ష డాలర్స్ కి పైగా గ్రాస్ వసూళ్లని సాధించి సాలిడ్ ఓపెనింగ్స్ సాదించినప్పటికీ ఆ తర్వాత డీలా పడింది. మొత్తంగా ఈ సినిమా విడుదలైన మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే రాబిన్ హుడ్’ చిత్రానికి రూ.28 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ 4 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ. 9.5 కోట్లు నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రాబిన్‌హుడ్ (Robinhood) సినిమా నాలుగో రోజు థియేటర్లలో ఆక్యుపెన్సీని పరిశీలిస్తే.. మార్నింగ్ షోలో 10.62%, మ్యాట్నీ షోలో 22.39%, ఫస్ట్ షోలో 22.01%, సెకండ్ షోలో 21.17% గా ఉంది. గతంలో నితిన్ (Nithin) – వెంకీ కుడుముల కాంబినేషన్లో వచ్చిన ‘భీష్మ’ పెద్ద హిట్ కొట్టగా, మళ్లీ వారిద్దరి కాంబోలో వచ్చిన రాబిన్ హుడ్ చిత్రం మాత్రం బాక్సఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది.

