మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చిత్ర బృందం మెగా అభిమానులకు అదిరిపోయే కానుక అందించింది. రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడీ సినిమా ఆడియో రైట్స్ విషయంలో ఓ రికార్డ్ క్రియేట్ చేసిందని తెలుస్తోంది. పెద్ది (Peddi) సినిమా ఆడియో రైట్స్ ఏకంగా రూ. 35 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఆడియో రైట్స్‌ను (Audio Rights) ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ కంపెనీ టీ సిరీస్ దక్కించుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌పై ఉన్న నమ్మకంతోనే టీ సిరీస్ ఇంత మొత్తం పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే రెహమాన్ మంచి మాస్, క్లాస్ బీట్లతో సాంగ్స్ రెడీ చేస్తున్నాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమా నుంచి మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా మేకర్స్ ప్రారంభించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా, కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఇదిలాఉంటే.. పెద్ది (Peddi) సినిమా గ్లింప్స్ వీడియోను శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోండగా.. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.

