టి 20 క్రికెట్ అంటేనే ధన ధన్ ఆట. దొరికిన బంతిని దొరికినట్టు బాదడమే. అటువంటి పొట్టి క్రికెట్ లో మేడిన్ ఓవర్ వేయడం అరుదుగా జరుగుతుంది. అయితే నిన్న రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే.
అయితే ఇదే మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మేడిన్ ఓవర్ వేయడమే కాకుండా మేడిన్ వికెట్ కూడా తీశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో మొదటి వికెట్ మేడిన్ ఓవర్ ఇదే
ఈ మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రచిన్ రవీంద్రను అవుట్ చేశాడు. ఈ ఐపీల్ సీజన్ లో జోఫ్రా ఆర్చర్ కు ఇదే మొదటి వికెట్. ఈ మ్యాచ్ లో మొత్తం మూడు ఓవర్లు వేసిన ఆర్చర్ ఒక మేడిన్ తో 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు


