సిద్ధు ‘జాక్‌’ ట్రైలర్‌ రిలీజ్‌కి డేట్ ఫిక్స్

by | Mar 31, 2025 | సినిమా

తెలుగు చిత్ర పరిశ్రమలో గతేడాది టిల్లు స్క్వేర్‌తో అభిమానులను మెప్పించిన సిద్ధు జొన్నలగడ్డ మరోసారి ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జాక్‌’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ (Trailer) అప్‌డేట్‌ను ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ ను ఏప్రిల్ 2న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

కాగా, ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్, టీజర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా, జాక్ (Jack) సినిమా కోసం డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్‌ ఓ డిఫరెంట్​ స్టోరీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో సిద్ధూ సరసన యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అచ్చు రాజమణి స్వరాలు అందిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ యుత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.