చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్యం 183 పరుగులు

by | Mar 30, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా  రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.  రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మొదటి ఓవర్లోనే ఓపెనర్ జైస్వాల్ అవుట్ అయ్యాడు

రెండవ వికెట్ కు మరో ఓపెనర్ సంజు శాంసన్, వన్ డౌన్ లో వచ్చిన నితీష్ రానా లు 82 పరుగులు జోడించారు. 20 పరుగులు చేసిన సంజు శాంసన్ అవుట్ అయ్యిన తరవాత వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్ తో కలిసి నితీష్ రానా మూడవ వికెట్ కు 38 పరుగులు జోడించారు

నితీష్ రానా కేవలం 36 బంతుల్లో 5 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో 81 పరుగులు చేసి అవుట్ అయ్యాడు

ఆ తరవాత వచ్చిన ధృవ్ జురెల్, హాసరంగా లు తక్కువ స్కోర్లకే అవుట్ అయ్యినా, కెప్టెన్ రియాన్ పరాగ్ స్కోర్ బోర్డు ను హేట్మేయర్ సాయంతో కదిలించాడు.  అయితే 37 పరుగులు చేసిన రియాన్ పరాగ్ అవుట్ అవడంతో స్కోర్ బోర్డు లో వేగం తగ్గింది

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల లో నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పతిరానా లు రెండేసి వికెట్లు తీయగా, అశ్విన్, జడేజా లు చెరో ఒక వికెట్ తీశారు