ఈ సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం అంటోన్న మెగా స్టార్ చిరంజీవి

by | Mar 30, 2025 | సినిమా

మెగా స్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా ఈ రోజు రామానాయుడు స్టూడియో లో ఘనంగా ప్రారంభమయింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా అనిల్ రావిపూడి లాంటి అద్భుతమైన దర్శకుడితో నా ప్రయాణం ప్రారంభమైందని అన్నారు.  ఈ చిత్రానికి  నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల.

మా సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా వచ్చిన వెంకీ మామకు ధన్యవాదాలు తెలిపారు మెగా స్టార్ చిరంజీవి.  ఈ సంక్రాంతి కి రఫ్ఫాడిద్దాం అన్నారు

మెగా స్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి తో పాటు ఇంకా ఈ చిత్ర ప్రారంభోత్సవానికి శరత్ మరార్, అశ్విని దత్, అల్లు అరవింద్, జెమినీ కిరణ్, దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు, విశ్వంభర దర్శకుడు వశిష్ట, బాబీ, వంశి పైడిపల్లి, విక్టరీ వెంకటేష్, కె రాఘవేంద్ర రావు   విచ్చేశారు. మెగా స్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేశారు