టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, దసరా మూవీ ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘ది పారడైజ్’ మూవీలో నాని సరికొత్త పాత్రలో మెస్మరైస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషనల్లో వచ్చిన ‘దసరా’ చిత్రం పలు అవార్డులను అందుకోవడంతో ఇప్పుడు రాబోతోన్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఏర్పడాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమాలో సోనాలి కులకర్ణి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో విలన్ పాత్రలో సీనియర్ నటుడు మోహన్ బాబు నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ బ్యాగ్డ్రాప్ లో జరిగే కథగా శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
తాజా సమాచారం ప్రకారం ఇక ఈ సినిమాలో నానికి జోడిగా బ్యూట్ క్వీన్ కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథ రీత్యా కథానాయిక పాత్రకు అత్యంత ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హీరోయిన్ పాత్రకు కృతి శెట్టి అయితే బాగా సూట్ అవుతుందని భావించిన చిత్ర బృందం ఇటీవల ఆమెను సంప్రదించగా వెంటనే కృతి శెట్టి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక అంతకుముందు నానికి జోడిగా కృతి శెట్టి ‘శ్యామ్ సింఘ రాయ్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
ఇక మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల గుండెల్లో ‘ఉప్పెన’ పుట్టించిన కృతి శెట్టి. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అందంతోనే కాదు అభినయంతోనూ అభిమానులను ఆకట్టుకుంటోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా, భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్ వంటి 8 భాషల్లో ఒకేసారి మార్చి 26, 2026న విడుదల కానుంది.

