సమ్మర్ వేడి ఏప్రిల్ నుండి ఎక్కువ అవుతుందని చెపుతున్నారు. ఈ సమ్మర్ వేడి ని తట్టుకోవడానికి కావలసినంత వినోదాన్ని అందించడానికి చిత్ర పరిశ్రమ సినిమాలను రెడీ చేసింది. అవేంటో చూద్దాం
ఈ సమ్మర్ లో మొదటగా బాల కృష్ణ నటించిన సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369 ని ఏప్రిల్ 4 రి రిలీజ్ చేస్తున్నారు
ఏప్రిల్ 4 న, అనిల్ విశ్వనాధ్ దర్శకత్వం వహించిన 28 డిగ్రీస్ సెల్సియస్ చిత్రం విడుదలవుతోంది
ఏప్రిల్ 10 న ఐదు సినిమాలు విడుదలవుతున్నాయి
- మైత్రి మూవీ మేకర్స్ మొదటి తమిళ్ సినిమా గుడ్, బాడ్, అగ్లీ. అజిత్, త్రిష హీరో హీరోయిన్లు. ఆధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు.
- తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని సన్నీడియోల్ తో తీసిన యాక్షన్ మూవీ ‘జాట్’
- మమ్ముట్టి నటించిన బజూక్ మలయాళ చిత్రం
- ధనుష్, నిత్యా మీనన్ నటించిన ‘ఇడ్లీ కడై’
- అంతే కాకుండా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జొన్నలగడ్డ సిద్దు, వైష్ణవి లు జంటగా వస్తోన్న చిత్రం ‘జాక్’.
ఏప్రిల్ 11 న యాంకర్ ప్రదీప్, మరో యాంకర్ దీపికా పిల్లి జంటగా నటించిన అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి
ఏప్రిల్ 17 న తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల-2
ఏప్రిల్ 18 న ప్రియదర్శి హీరోగా వస్తోన్న సారంగపాణి జాతకం
ఏప్రిల్ 18 న అనుష్క నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఘాటీ
ఏప్రిల్ 18 న కేసరి చాప్టర్ 2 (హిందీ సినిమా)
ఏప్రిల్ 18 న నక్కిన క్రియేటివ్స్ పతాకంపై దర్శకుడు నక్కిన త్రినాధరావు నిర్మించిన చౌర్య పాఠం
ఏప్రిల్ 18 న భూత్ని అనే హారర్ హిందీ చిత్రం
ఏప్రిల్ 25 న యుద్ధ నేపథ్యంలో వస్తోన్న హిందీ చిత్రం గ్రౌండ్ జీరో
ఇవే కాకుండా ఓ టి టి ప్లాట్ ఫామ్ లలో కొన్ని చిత్రాలు విడుదలవుతున్నాయి
ఏప్రిల్ 4 నుండి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో నయనతార నటించిన టెస్ట్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవబోతోంది
ఏప్రిల్ 11 నుండి చోరీ 2 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవబోతోంది
ఏప్రిల్ 25 నుండి జెవెల్ థీఫ్ ను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు


