మొదటి వన్ డే లో నూ ఓడిన పాకిస్థాన్

by | Mar 29, 2025 | వార్తలు

న్యూజిలాండ్ , పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్ డే లో న్యూజిలాండ్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  టి 20 సిరీస్ ను 4-1 తో కోల్పోయిన పాకిస్థాన్, వన్ డే సిరీస్ ని కూడా ఓటమితో ప్రారంభించింది

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 344 పరుగుల భారీ స్కోర్ చేసింది

50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ను మార్క్ చాప్ మన్, డరిల్ మిచెల్ లు ఆదుకున్నారు.  వీరిద్దరూ నాలుగవ వికెట్ కు 199 పరుగులు జోడించారు. మార్క్ చాప్ మన్ 111 బంతుల్లో 132 పరుగులు , డరిల్ మిచెల్ 84 బంతుల్లో 76 పరుగులు చేసి అవుట్ అయ్యాక వచ్చిన ముహమ్మద్ అబ్బాస్ ధాటిగా ఆడుతూ 26 బంతుల్లో 52 పరుగులు చేశాడు

న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి చేసిన 344 పరుగులలో, మార్క్ చాప్ మన్, డరిల్ మిచెల్, ముహమ్మద్ అబ్బాస్ లు ముగ్గురు కలిసి చేసిన పరుగులు 260. ఎక్సట్రాల రూపంలో మరో 43 పరుగులు వచ్చాయి 

పాకిస్థాన్ బౌలర్లలో ఇర్ఫాన్ ఖాన్ మూడు వికెట్లు తీయగా, అఖీఫ్ జావేద్, హరీస్ రాఫ్ లు రెండేసి వికెట్లు తీశారు.   మొహమ్మద్ అలీ, నసీం షా లు చెరో ఒక వికెట్ తీశారు

అనంతరం 345 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ కు అబ్దుల్లా షఫీక్, ఉస్మాన్ ఖాన్ లు మొదటి వికెట్ కు 83 పరుగులు జోడించి మంచి శుభారంభాన్నిచ్చారు

అబ్దుల్లా షఫీక్ 36 పరుగులు, ఉస్మాన్ ఖాన్ 39 పరుగులు చేసి వెంట వెంటనే  అవుట్ అయ్యారు.  ఆ తరవాత వచ్చిన బాబర్ అజాం, కెప్టెన్ రిజ్వాన్ లు మూడవ వికెట్ కు 76 పరుగులు జోడించాక 30 పరుగులు చేసిన రిజ్వాన్ అవుట్ అయ్యాడు.  ఆ తరవాత సల్మాన్ ఆఘా తో తో కలిసి  బాబర్ అజామ్ నాలుగవ వికెట్ కు 85 పరుగులు జోడించారు. అయితే 78 పరుగులు చేసిన బాబర్ అజామ్ అవుట్  అయ్యినప్పటినుండి పాకిస్థాన్ కు కష్ఠాలు వచ్చి పడ్డాయి.

పాకిస్థాన్ 38.3 ఓవర్ల కు 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసిన పాకిస్థాన్ జట్టు, బాబర్ అజామ్ అవుట్ అయ్యిన తరవాత క్రమం తప్పకుండ వికెట్ లు కోల్పోయింది

సల్మాన్ ఆఘా తరవాత క్రీజ్ లోకి వచ్చిన ఆరుగు బ్యాట్స్ మన్ లలో ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టుమని రెండు పరుగులు చేయలేదు. ఇద్దరు డక్ అవుట్ కాగా, ముగ్గురు ఒక్కొక పరుగు చేశారు. మొహమ్మద్ అలీ పరుగులేమి చేయకుండా నాట్ అవుట్ గా ఉన్నాడు. చివరకు పాకిస్థాన్ 44.1 ఓవర్ల లో 271 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.  3 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసిన పాకిస్థాన్, చివర 23 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది

న్యూజిలాండ్ బౌలర్ల లో నాథన్ స్మిత్ 4 వికెట్లు తీయగా,డఫీ రెండు వికెట్లు        తీశాడు. ఒరూర్కే, బ్రేస్ వెల్, అబ్బాస్ లు తలా ఒక వికెట్ తీశారు