43 ఏళ్ళ ధోని మెరుపు స్టంపింగ్ మొన్న సూర్య కుమార్, నిన్న సాల్ట్

by | Mar 29, 2025 | వార్తలు

ఏం ఎస్ ధోని, భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీ లు అందించిన ఏకైక కెప్టెన్.  ధోని  డి ఆర్ ఎస్ తీసుకున్నాడంటే ఖచ్చితంగా అవుట్  అన్నమాట. అలానే ధోని వికెట్ కీపింగ్ చేస్తున్నాడంటే బ్యాట్స్ మన్ లు అప్రమత్తంగా ఉండాలి. ధోని మెరుపు వేగాన్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు.  43 ఏళ్ళ వయసులో కూడా ఎంతో అలెర్ట్ గా ఉంటూ మెరుపు వేగంతో స్టంప్ అవుట్ లు చేస్తున్నాడు ఏం ఎస్ ధోని

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ ను స్టంప్ అవుట్ చేసిన ధోనీ, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ ను కూడా మెరుపు వేగంతో స్టంప్ అవుట్ చేశాడు

ధోని వికెట్ల వెనుక ఉన్నదంటే క్రీజ్ లో నుండి ముందుకు రావాలంటే భయపడాల్సిందే. 43 ఏళ్ళ వయసులో కూడా అదే చురుకుదనం, అదే మెరుపు వేగం

ఈ రెండు స్టంప్ అవుట్ లను ఐపీల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.  దీనికి 2 మూమెంట్స్ అఫ్ మేజిక్ 2 అల్ట్రా ఫాస్ట్ స్టంపింగ్స్ అని కాప్షన్ పెట్టింది.  అంతే కాదు మీరు ఏ స్టంప్ అవుట్ ని బాగా ఎంజాయ్ చేశారు వారి రాసుకు వచ్చింది. ఈ కింద లింక్ ను బ్రౌజర్ లో పేస్ట్ చేసి చూడండి

https://twitter.com/IPL/status/1905649492839596347