‘ప్రభాస్ ఆ మాట చెప్పుంటే, కన్నప్ప ఆపేసేవాడిని’ – మంచు విష్ణు

by | Mar 27, 2025 | సినిమా

టాలీవుడ్ స్టార్ హీరో విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను చిత్ర బృందం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్‌ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మేకర్స్​ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రైలర్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘నేను ఎన్నో ఏళ్లుగా ఆంజనేయస్వామి భక్తుడిని. కానీ ‘కన్నప్ప’ సినిమాతో శివభక్తుడిగా మారిపోయాను. ఈ సినిమా చిత్రీకరణ​ సమయంలో నేల పైనే పడుకున్నాను. నటుడిగానూ కన్నప్ప ముందు, ఆ తర్వాత అన్నట్లు నా జీవితం మారింది. ఈ ప్రాజెక్ట్‌ నాకొక బిడ్డ లాంటిది అని మంచు విష్ణు అన్నారు. అలాగే ‘కన్నప్ప’ (Kannappa) సినిమాను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయాలని రెబల్ స్టార్ కృష్ణంరాజు అనుకున్నారు. కానీ ఆయన ఇప్పుడు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. ఒకవేళ కృష్ణంరాజు గారి కోరిక మేరకు ప్రభాస్ ‘కన్నప్ప’ సినిమా చేస్తానని నాతో చెప్పుంటే మాత్రం నేను ఈ సినిమా చేసేవాడినే కాదు. మా చిత్రానికి దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

కాగా, ఈ సినిమాలో మంచు విష్ణుకు జోడిగా హీరోయిన్ పాత్రలో ‘ఓం భీమ్ బుష్’ ఫేమ్ ప్రీతి ముకుందన్ నటిస్తోంది. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ పార్వతీ దేవిగా అలరించబోతున్నారు. అలానే మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, శివ బాలాజీ, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈ సినిమాలో రుద్ర పాత్రను పోషించారు. కాగా, పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్‌ దేవస్సే, తెలుగు సంగీత దర్శకుడు మణిశర్మ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు