‘కింగ్​డమ్​’ కోసం రౌడీ హీరో షాకింగ్ నిర్ణయం

by | Mar 27, 2025 | Uncategorized

టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్​డమ్​’. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో విజయ్‌ దేవరకొండ కనిపిస్తారని తెలిసింది. అలాగే విజయ్‌ దేవరకొండ క్యారెక్టరైజేషన్‌లో విభిన్న కోణాలు ఉంటాయట. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 30న విడుదల చేయనున్నారు. అయితే ఈ ‘కింగ్​డమ్​’ సినిమా కోసం విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా నిర్మాత నాగవంశీ ఈ చిత్రానికి సంబంధించి విజయ్ దేవరకొండతో జరిగిన ఒప్పందం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ మూవీ ప్లాప్ అవడంతో పూరి జగన్నాథ్‌తో బయ్యర్లు గొడవకు దిగారు. దాంతో తన వంతు సాయంగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కొంత రెమ్యూనరేషన్ ను తిరిగి ఇచ్చేశాడు. ఇప్పుడు ‘కింగ్ డమ్’ సినిమా రెమ్యునరేషన్ గా కూడా కొంత డబ్బును మాత్రమే అడ్వాన్స్ గా తీసుకున్నాడు. ఈ సినిమాను మరింత గొప్పగా తీసేందుకు విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయం ఎంతగానో ఉపయోగపడింది. ఈ సినిమా విడుదలై మంచి లాభాలు వస్తే మిగతా రెమ్యునరేషన్ తీసుకుంటానని విజయ్ దేవరకొండ చెప్పినట్లు ప్రొడ్యూసర్ నాగవంశీ వెల్లడించాడు.

కాగా, ఇటీవల ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. కాగా, ఈ సినిమాలోని లవ్ సాంగ్ షూట్ కోసం చిత్ర యూనిట్ ఇటీవలే శ్రీలంకకు వెళ్లింది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండ‌గా.. అణచివేతకు గురైన తన జాతి ప్రజలను రక్షించుకోవడానికి శ్రీలంక సైన్యాన్ని ఎదురించే తిరుగుబాటు నాయకుడిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ‘కింగ్​డమ్​’ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వస్తున్నాయి. మొదటి భాగం ఈ ఏడాది మే 30న, రెండో పార్ట్ ఆ తర్వాత రిలీజ్ అవుతుందని టాక్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍ గా నటిస్తోండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.