క్యాష్ తో కమెడియన్స్ ని కొనలేరు అన్న వెన్నెల కిశోర్

by | Mar 26, 2025 | సినిమా

రాబిన్ హుడ్ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా హీరో నితిన్, వెన్నెల కిశోరె ఒకసరదా పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. యాంకర్ గా నితిన్ చేశారు. నితిన్ అడిగిన కొన్ని ప్రశ్నలకు వెన్నెల కిశోర్ చాలా ఫన్నీ ఆన్సర్స్ చెప్పారు

మీరు మూవీ ప్రొమోషన్స్ ఎందుకు పాల్గొనరు అని నితిన్ అడిగిన ప్రశ్నకు వెన్నెల కిషొర్ ఒక కమెడియన్ ఒక నెలకు 6 సినిమాలు చేస్తారు.  ఒక హీరో 6 నెలలకు ఒక సినిమా చేస్తాడు. కమెడియన్ లు సినిమాలు చేయాలా, ప్రొమోషన్స్ చేయాలా అని బదులిచ్చారు. 

అప్పుడు నితిన్ పోనీ ప్రొమోషన్స్ కు డబ్బులిస్తే అని అడగగా అప్పుడు వెన్నెల కిశోర్ క్యాష్ తో కమెడియన్స్ ని కొనలేరు అని అన్నారు. చాల సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూ ని మీరు చూసేయండి

టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్, బ్యూటీ క్వీన్ శ్రీలీల హీరో, హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్‌’.చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నవీన్‌ యేర్నేని, రవి శంకర్ నిర్మాతలకుగా వ్యవహరిస్తున్నారు.

ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా ఉగాది పండుగ కానుకగా మార్చి 28న థియేటర్లలో గ్రాండ్​గా విడుదల కానుంది

ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ‘జీ5’ ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకోగా.. ‘జీ తెలుగు’ ఈ మూవీ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.