టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, దసరా మూవీ ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘ది పారడైజ్’ మూవీలో నాని సరికొత్త పాత్రలో మెస్మరైస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు నాని (Nani), శ్రీకాంత్ ఓదెల కాంబినేషనల్‌లో వచ్చిన ‘దసరా’ చిత్రం పలు అవార్డులను అందుకోవడంతో ఇప్పుడు రాబోతోన్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఏర్పడాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమాలో సోనాలి కులకర్ణి కీలక పాత్రలో కనిపించనున్నారు. సికింద్రాబాద్ బ్యాగ్డ్రాప్ లో జరిగే కథగా శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా.. తాజాగా మేకర్స్ మరో అదిరిపోయే అప్డేట్ అందించారు.
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) మూవీ సరిగ్గా వచ్చే ఏడాది ఇదే రోజున మీ ముందుకు రాబోతుంది. బిగ్ స్క్రీన్ మీద ప్యారడైజ్ ప్రపంచాన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి. ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్ వంటి 8 భాషల్లో ఒకేసారి మార్చి 26, 2026న విడుదల చేయనున్నాం అని చిత్ర బృందం ప్రకటించారు. ఈ క్రమంలోనే ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో హీరో నాని కండలు తిరిగిన దేహంతో జులపాల జుట్టుతో భుజాన తుపాకీ వేసుకొని కోపంగా చూస్తున్న లుక్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.65 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీ ఆడియో రైట్స్ 18 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం. ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రలో సీనియర్ నటుడు మోహన్ బాబు నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో మోహన్ బాబు క్యారెక్టర్ ను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పవర్ఫుల్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో హీరోకు ధీటుగా విలన్ రోల్ ఉండనుందని అంటున్నారు. అయితే దీని గురించి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Jhanvi Kapoor) హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం.

