చిరు – అనిల్ మూవీకి మూహూర్తం ఫిక్స్

by | Mar 26, 2025 | సినిమా

తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ తాజా చిత్రం ‘విశ్వంభర’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. దాంతో పాటుగా దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్‌ ఓదెలతో ఓ సినిమాను చేయనున్నారు. అలాగే అనిల్‌ రావిపూడితో కూడా ఓ సినిమాను చేయనున్నట్లు చిరు ప్రకటించారు. ఈ సినిమాను షైన్‌ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మించనున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల నానితో ‘ది పారడైజ్‌’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతనే చిరంజీవితో సినిమా ఉంటుందని తెలుస్తోంది. అయితే ‘విశ్వంభర’ మూవీ షూటింగ్ పూర్తవగానే చిరు, అనిల్‌ రావిపూడి సినిమా సెట్స్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావిపూడి పూ(Anil Ravipudi) ర్తి చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం మార్చి 30న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.

హైద్రాబాద్ లో జరగనున్న ఈ వేడుకకి చిరంజీవి Chiranjeevi) , అనిల్ రావిపూడిలతో పాటుగా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, పలువురు దర్శకులు, నిర్మాతలు హాజరవుతున్నారని తెలుస్తోంది. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. కాగా, చిరంజీవి హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీ త‌ర‌హాలో ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమాను రూపొందించాలని భావిన్నాడ‌ట‌. ఈ క్రమంలొనే కామెడీతో పాటుగా ఎమోషన్స్ మిక్స్ చేసి అనిల్ రావిపూడి స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక యాక్షన్‌ సీన్స్‌ కూడా ఓ రేంజ్‌లోనే ఉంటాయని తెలుస్తోంది. ఈ మూవీలో చిరంజీవి సరసన అదితి రావు హైదరీ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈమెతో పాటు ఐశ్వర్యా రాజేష్, శృతి హాసన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.