ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడు రోజుల క్రితమే మొదలైంది. స్పోర్ట్స్ డ్రామా టెస్ట్ ను నేరుగా ఓ టి టి లో విడుదల చేయనున్నారు
నయనతార, మాధవన్,సిద్ధార్ధ్, మీరా జాస్మిన్ లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టెస్ట్’. ఎస్ శశికాంత్ ఈ చిత్రానికి దర్శకుడు. ఏప్రిల్ 4 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు
చెన్నైలో జరిగిన ఒక అంతర్జాతీయ మ్యాచ్ ముగ్గురి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపింది అనే అంశంపై ఈ టెస్ట్ చిత్రాన్ని రూపొందించారు
ఈ టెస్ట్ చిత్రాన్ని తమిళం లోనే కాకుండా, తెలుగు కన్నడ, మలయాళ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నారు.

