యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్, సలార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగెన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. పక్కా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మాలీవుడ్ స్టార్లు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అప్డేట్ ను మేకర్స్ అందించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తాజాగా ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఇదిలాఉంటే.. ఈ సినిమా సెట్స్ లో హీరో ఎన్టీఆర్(NTR) ఇంకా అడుగుపెట్టని సంగతి తెలిసిందే. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ శ్రీలంకకు వెళ్లనుంది. అక్కడి లొకేషన్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓ భారీ రిస్కీ ఫైట్ ను కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమయ్యే శ్రీలంక షెడ్యూల్లో హీరో ఎన్టీఆర్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ ముగిశాక ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేస్తున్న ‘వార్-2’ మూవీ చిత్రీకరణలో పాల్గొననున్నాడట. కాగా, ఈ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ (NTR) ఆర్ట్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) , నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు

