ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 20 ఓవర్ల లో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది
ఓపెనర్ ప్రభు సిమ్రాన్ 5 పరుగులు చేసి అవుట్ అయినా, వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య తో కలిసి రెండవ వికెట్ కు 51 పరుగులు జోడించాడు
ప్రియాంశ్ ఆర్య 23 బంతుల్లో 47 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన ఓమార్జాయి 16 పరుగులు చేయగా, పవర్ హిట్టర్ మాక్స్ వెల్ డక్ అవుట్ అయ్యాడు
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాత్రం శివాలెత్తిపోయాడు. ఒక వైపు వికెట్లు పడుతున్న బాదుడు మాత్రం ఆపలేదు. అయితే ఐదవ వికెట్ కు శ్రేయాస్ అయ్యర్, స్టయినిస్ లు 57 పరుగులు జోడించారు. 20 పరుగులు చేసిన స్టయినిస్ అవుట్ అయ్యాక, శశాంక్ సింగ్ శ్రేయాస్ అయ్యర్ తో జత కలిశాడు. శశాంక్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరు ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డు ను పరిగెత్తించారు
శ్రేయాస్ అయ్యర్ 42 బంతుల్లో ఫోర్లు, సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ కు ఒక్క బంతి కూడా అవకాశం ఇవ్వకుండా శశాంక్ సింగ్ ఫోర్లతో విరుచుకు పడ్డాడు. దీనితో శ్రేయాస్ అయ్యర్ సెంచరీకి 3 పరుగుల దూరంలో ఆగిపోయాడు. శశాంక్ సింగ్ 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఆరవ వికెట్ కు శ్రేయాస్ అయ్యర్, శశాంక్ సింగ్ లు 81 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు
గుజరాత్ టైటాన్స్ బౌలర్ల లో సాయి కిశోర్ మూడు వికెట్లు తీయగా, రబడా, రషీద్ ఖాన్ లు చెరో ఒక వికెట్ తీశారు

