ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని పంజాబ్ కింగ్స్ టీం గురించి తెలుసుకుందాం
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ : శ్రేయాస్ అయ్యర్ కోచ్: రికీ పాంటింగ్
Punjab Kings Owner – K.P.H. Dream Cricket Private Limited
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. నిలకడైన ఆట తీరుతో భారత జట్టు ఆపద్బాంధవుడు గా పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్యనే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ శ్రేయాస్ అయ్యారు. ధాటిగా ఆడగలడు, గోడలా నిలబడగలడు. అయితే సందర్భాన్ని బట్టి ఒక్కోసారి ఇన్నింగ్స్ నిర్మించటానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు
పంజాబ్ కింగ్స్ బ్యాట్స్ మన్ కోటాలో శ్రేయాస్ అయ్యర్, జోష్ ఇంగ్లిస్, ప్రభు సిమ్రాన్ సింగ్ ప్రధాన బ్యాటర్లు. వీరికి తోడుగా నేహాల్ వధేరా, విష్ణు వినోద్, శశాంక్ సింగ్ లు ఉన్నారు. ఆరంగేట్రం చేయడానికి పన్ను, అవినాష్ లు బెంచ్ మీద ఉన్నారు
పంజాబ్ కింగ్స్ అల్ రౌండర్ల జాబితాలో మేటి అల్ రౌండర్లు ముగ్గురు ఉన్నారు. మార్కస్ స్టయినిస్, మాక్స్ వెల్, అజమాతుల్లా ఓమార్జాయి ఉన్నారు. ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించగల సత్తా ఉన్నవాళ్లు ఈ ముగ్గురు. వీరితో పాటు అనుభవజ్ఞులైన హరిప్రీత్ బ్రార్, మార్కో జాన్సెన్ లు కూడా ఉన్నారు. ఇంకా అరంగేట్రం చేయడానికి తహతహలాడుతున్న ప్రియాంశ్ ఆర్య, ఆరోన్ హార్డీ, ముషీర్ ఖాన్, సూర్యన్ష్ షెడ్జ్ ఉన్నారు.
బౌలింగ్ విభాగం లో భారత జట్టు టాప్ టి 20 బౌలర్ అర్షి దీప్ సింగ్ ఉండడం కలిసొచ్చే అంశం. మొదటి రెండు ఓవర్ల లోనే బ్రేక్ ఇవ్వడం ఆర్షదీప్ సింగ్ స్పెషలిటీ
ఇంకా ఐపీల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన యజువేంద్ర చాహల్ స్పిన్ విభాగంలో ఉన్నాడు. అర్షదీప్ సింగ్, చాహల్ లు పంజాబ్ కింగ్స్ మెయిన్ బౌలర్లు. అంతే కాకుండా స్టయినిస్, మాక్స్ వెల్, ఓమార్జాయి, జాన్సెన్ లు కూడా పంజాబ్ కింగ్స్ బౌలింగ్ అస్త్రాలే
ఇంకా అనుభవజ్ఞుడైన ఫెర్గుసన్ తో పాటు యువ బౌలర్ లు యష్ ఠాకూర్, విజయ్ కుమార్, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దూబే లు ఉన్నారు
ఇంకా అరంగేట్రం చేయని ఫాస్ట్ బౌలర్ బార్ట్లేట్ ఈ సారి పంజాబ్ కింగ్స్ ఉపయోగించుకోవచ్చు
ఇప్పటివరకు ఒక్క ఐపీల్ ట్రోఫీ ని గెలవలేని పంజాబ్ కింగ్స్ 2014 లో ఫైనల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది
ఇప్పటివరకు 17 ఐపీల్ సీజన్లలో ఆడిన పంజాబ్ కింగ్స్ మొదటి సీజన్లో సెమి ఫైనల్ కు వచ్చింది. ఆ తరవాత 2014 లో ఒక సారి ఫైనల్ కు వచ్చి ఓడిపోయింది.
తరచూ కెప్టెన్ లు మార్చే పంజాబ్ కింగ్స్ రాత శ్రేయాస్ అయ్యర్ వచ్చిన తరవాత మారుతుందేమో చూద్దాం

