గుజరాత్ టైటాన్స్ ను తక్కువ అంచనా వేయవద్దు

by | Mar 25, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ టైటాన్స్ టీం గురించి తెలుసుకుందాం

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ : Subhman Gill  కోచ్ : Ashish Nehra

గుజరాత్ టైటాన్స్ ఓనర్ : Irelia Sports India Private Limited

గుజరాత్ టైటాన్స్ ఆరుగురు ప్రధాన బ్యాట్స్ మన్ ఉన్నారు. వీరిలో కెప్టెన్ శుబ్ మన్ గిల్ తో పాటు, జోష్ బట్లర్, గ్లెన్  ఫిలిప్స్ ఉన్నారు.  బట్లర్ ఫామ్ లో లేకపోవడం గుజరాత్ టైటాన్స్ కు మైనస్ పాయింట్.  20 ఏళ్ళ వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ అయినా కుమార్ కుషాగ్ర కు ఈ సారి అవకాశం రావచ్చు.  అనుజ్ రావత్, వెస్ట్ ఇండీస్ కు చెందిన రూథర్ ఫోర్డ్ లు కూడా మంచి హిటర్లే

బ్యాటింగ్ డిపార్ట్మెంట్ బలంగానే కనపడుతోన్న, బట్లర్ ఫామ్ గుజరాత్ టైటాన్స్ కలవర పెడుతోంది

గుజరాత్ టైటాన్స్ కు యువ అల్ రౌండర్ లు ఉన్నారు.  భారత జట్టుకు చెందిన వాషింగ్టన్ సుందర్ తో పాటు యువ అల్ రౌండర్ లు సాయి సుదర్శన్, సాయి కిశోరె, లోమరోర్, అర్షద్ ఖాన్, షారుఖ్ ఖాన్, జయంత్ యాదవ్  లు ధాటిగా ఆడే సత్తా ఉన్నవాళ్లే

నిశాంత్ సింధు, కరీం జనత్ లు ఐపీల్ లో అరంగేట్రం చేయడానికి తహతహలాడుతున్నారు

బౌలింగ్ డిపార్ట్మెంట్ లో పేస్ విభాగంలో రబడా, సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కొయెట్జ్, ఇషాంత్ శర్మ లు ఉన్నారు. 

స్పిన్ విభాగంలో రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ లు ఉన్నారు. వీరిద్దరూ గుజరాత్ టైటాన్స్ కు పెద్ద బలం. స్పిన్ బౌలిం చేయడమే కాకుండా లోయర్ ఆర్డర్ లో ధాటిగా ఆడగల బ్యాట్స్  మన్

ఖేజ్రోలియా, గుర్నార్  సింగ్ బ్రార్, మనవ్ సుతార్ లు అవకాశం కోసం చూస్తున్నారు

గుజరాత్ టైటాన్స్ జట్టు మొత్తంగా సమతూకంతో ఉంది. అయితే బ్యాటింగ్ లో శుభ్ మన్ గిల్, బట్లర్, ఫిలిప్స్,సాయి సుదర్శన్ రాణించడంపైనే గుజరాత్ టైటాన్స్ విజయావకాశాలు ఉంటాయి

ఐపీల్ లో అరంగేట్రం చేసిన మొదటి సంవత్సరం (2022) లోనే  గుజరాత్ టైటాన్స్ ఐపీల్ ఛాంపియన్ గా అవతరించింది. 2023 లో రన్నర్ అప్ గా నిలిచింది.  దీనిని బట్టి గుజరాత్ టైటాన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉందొ తెలుస్తుంది