టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శైలేశ్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘హిట్’: ది థర్డ్ కేస్’ ఫుల్ లెంగ్త్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ మూవీలో అర్జున్ సర్కార్ అనే ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నాని కనిపించనున్నారు. కఠినత్వానికీ, కనికరం లేని తత్వానికి ప్రతీకగా ఆయన పాత్ర సాగుతుందని, ఇప్పటి వరకు నాని పోషించిన పాత్రలతో పోల్చితే ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండనుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ఈ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. ఇప్పటికే రిలీజైన ‘హిట్ 3’ ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి మరో అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్.
ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నుంచి ‘ప్రేమ వెల్లువ..’ అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఇందులో హీరో నాని (Nani) హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా చాలా క్యూట్ గా, రొమాంటిక్ గా కనిపించారు. ఈ సాంగ్ చూస్తుంటే మూవీలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయినట్లు తెలుస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీత స్వరాలు అందించిన ఈ ‘ప్రేమ వెల్లువ..’ సాంగ్ ను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరాం, గాయని నూతన మోహన్ ఆలపించారు. ఈ సాంగ్ అందరిని అలరించడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా, హిట్ ఫ్రాంచైజీలో భాగంగా ఇంతకుముందు యువ హీరోలు విష్వక్ సేన్ ‘హిట్’, అడివి శేష్ ‘హిట్ 2’లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో ‘హిట్ 3’పై (HIT) భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా వేసవి కానుకగా మే 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు

