ప్రముఖ సినిమా చైన్ సంస్థ పివిఆర్ ఐనాక్స్ బీసీసీఐ తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ని వీకెండ్ మ్యాచ్ లను, ప్లే ఆఫ్ మ్యాచ్ లను ప్రసారం చేయడానికి ఒప్పందం చేసుకుంది
దేశంలో సుమారు 30 నగరాలలో ఈ ఐపీల్ (IPL) మ్యాచ్ లను పివిఆర్ ఐనాక్స్ థియేటర్ల లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు
థియేటర్ లో చూసే వాళ్లకు హై క్వాలిటీ సౌండ్ సిస్టం, విజువల్స్ తో ఐపీల్ ని చూస్తుంటే స్టేడియం లో క్రికెట్ చూసిన అనుభూతి కలుగుతుంది
దేశంలో అని ప్రధాన, పెద్ద నగరాలలో ఐపీల్ ను పివిఆర్ ఐనాక్స్ లో చూసే ఏర్పాట్లు చేస్తున్నారు
ఈ రోజు కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ తో పివిఆర్ ఐనాక్స్ లో ఈ ప్రసారాలు ప్రారంభమవుతాయి
అయితే ఇప్పటికే సాటిలైట్, డిజిటల్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్ సంస్థలు బీసీసీఐ, పివిఆర్ ఐనాక్స్ (PVR Inox) తో చేసుకున్న ఒప్పందంపై ఎలా స్పందిస్తాయో చూడాలి

