ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమరం ఈ రోజు నుండే మొదలవుతోంది. ఒక పక్క మండే ఎండలు, మరో పక్క ఐపీల్ మ్యాచ్ లు. ఒకరకంగా ఐపీల్ తో సమ్మర్ లో రిలాక్స్ అవచు కదా.
ఈ రోజు ఐపీల్ మొదటి మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య కోల్ కతా లో మ్యాచ్ జరుగుతుంది.
ఇప్పుడు ఈ రెండు జట్ల బలాలు, బలహీనతలు గురించి తెలుసుకుందాం. ముందుగా ఆర్సీబీ టీం గురించి తెలుసుకుందాం.
ఆర్సీబీ గురించి చెప్పాలంటే మొదటగా ఈ సారి కెప్టెన్ గా ఎన్నికైన రజత్ పటిదార్ తో మొదలు పెడతాం
2022 లో ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో పై ఆడిన సూపర్ ఇన్నింగ్స్ (54 బంతుల్లో 112 పరుగులు) రజత్ పటిదార్ జీవితాన్ని మార్చేసిందని చెప్పవచ్చు. ఆ మ్యాచ్ లో వీరోచిత ఇన్నింగ్స్ తో రాయల్ చాలెంజర్స్ ని గెలిపించడంతో రజత్ పటిదార్ ఆర్సీబీ కీలక ఆటగాడిగా ఎదిగాడు
మూడేళ్ళ ముందు Unsold ప్లేయర్ గా ఉన్న రజత్ పటిదార్ ను కోల్ కతా నైట్ రైడర్స్ 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమయి 17 ఏళ్ళు అయినా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీ ని గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కు కెప్టెన్ అయిన రజత్ పటిదార్ వయసు 31 ఏళ్ళు
17 ఏళ్ళు అయి నా ఐపీల్ టైటిల్ గెలవని టీం కు యువ రక్తం అవసరమని భావించి ఆర్సీబీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది. ఆర్సీబీ యాజమాన్యం మంచి నిర్ణయమే తీసుకుంది. ఇప్పుడు రజత్ పటిదార్ పై చాల పెద్ద బాధ్యత ఉంది అదేంటంటే టీం ను నడిపించడమే కాకుండా ఐపీల్ ట్రోఫీ ని గెలవడం
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (Royal Challengers Bangalore) టీం ఎలా ఉందొ ఒకసారి చూద్దాం
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ : రజత్ పటిదార్ కోచ్ : ఆండీ ఫ్లవర్
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఓనర్ : Royal Challengers Sports Private Ltd
ఆర్సీబీ కి ఆరుగురు 6 బ్యాట్స్ మన్ లు ఉన్నారు. వాళ్లెవరో చూద్దాం. రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికారా
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు టీం కు, బ్యాటింగ్ లో నమ్మదగిన ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli) , కొత్త కెప్టెన్ రజత్ పటీదార్లు మాత్రమే కనపడుతున్నారు. ఈ మధ్య కాలంలో జితేష్ శర్మ కూడా బాగానే ఆడుతున్నాడు. ఫిల్ సాల్ట్, పడిక్కల్ ల లో కన్సిస్టెన్సీ లేదు. 20 ఏళ్ళ చికారా కు ఆడే అవకాశం వస్తే మాత్రం నిరూపించుకోవాల్సిఉంది
ఇక అల్ రౌండర్స్ విషయానికి వస్తే ఉండడానికి ఏడుగురు అల్ రౌండర్లు ఉన్నా నిఖార్సైన, నమ్మదగిన అల్ రౌండర్ కనపడడం లేదు. ఇక్కడే ఆర్సీబీ సమస్య
లివింగ్ స్టోన్, కృనాల్ పాండ్య, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రోమారో షెఫర్డ్, మనోజ్ భండగే, జాకబ్ బెథెల్ – వీళ్ళలో ఎవరిని పూర్తిగా నమ్ముకోలేని పరిస్థితి. లివింగ్ స్టోన్ స్థాయికి తగ్గ ఆట ఆడలేకపోతున్నాడు. ఆర్సీబీ కి ఇదే పెద్ద సమస్య
ఇక బౌలర్ల విషయానికి వస్తే హేజిల్ వూడ్, భువనేశ్వర్ కుమార్, కొద్దో గొప్పో లుంగీ ఎంగిడి కనపడుతున్నారు. యష్ దయాల్ కూడా పరవాలేదనిపిస్తాడు. రసిఖ్ దార్, సుయాశ్ శర్మ, నువాన్ తుషార, అభినందన్ సింగ్, మోహిత్ రాతీ ల పై పూర్తి గా ఆధార పడలేని పరిస్థితి
ఇక్కడ రజత్ పటిదార్ చేయాల్సిందల్లా అందరిని ఒకటి తాటిపైకి తీసుకు వచ్చి, అందరు ఆడేలా చేయాలి. సమిష్టిగా రాణిస్తేనే ఆర్సీబీ కి విజయావకాశాలు ఉంటాయి. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి పటిదార్ వెనుకాడకూడదు. ధోని లా ఆలోచించాలి
ఇప్పుడు 2024 ఐపీల్ ఛాంపియన్ ఆయిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు గురించి తెలుసుకుందాం
కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ : అజింక్య రహానే కోచ్ : చంద్రకాంత్ పండిట్
కోల్ కతా నైట్ రైడర్స్ ఓనర్ : Knight Riders Sports Private Limited
కెప్టెన్ గా గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ ను గెలిపించిన శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ అయ్యాడు. కోల్ కతా నైట్ రైడర్స్ ఒక మంచి నిలకడైన బ్యాట్స్ మన్ తో పాటు ఒక విజయవంతమైన కెప్టెన్ ను కూడా కోల్పోయింది అనడం సందేహం లేదు.
ఈ సారి భారత జట్టు సీనియర్ ఆటగాడైన రహానే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో సూపర్ హిట్టర్స్ ఉన్నారు. పొట్టి క్రికెట్ కు సరి తూగే టీం ఇది. రింకు సింగ్, డికాక్, రోవమన్ పావెల్, మనీష్ పాండే ల రూపం లో మంచి ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు చెలరేగినా ఆపడం కష్టం. రహ్మతుల్లా గర్భాజ్, రఘువంశీ, సిసోడియా లు అవకాశం వచ్చినప్పుడు ధాటిగా ఆడే సత్తా ఉన్నవాళ్లే.
కెప్టెన్ రహానే ఎలాగూ ఉన్నాడు. అవసరమైనప్పుడు ధాటిగా ఆడగలడు, అవసరమైతే గోడలా నిలబడగలడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన రహానే రాటుదేలాడు.
ఇక అల్ రౌండర్స్ విషయానికి వస్తే మేటి అల్ రౌండర్లు ఉన్నారు. వెంకటేష్ అయ్యర్, రస్సెల్, మొయిన్ ఆలీ లు ఉన్నారు. అనుకుల్ రాయ్, రమణ్ దీప్ సింగ్ లు కూడా తక్కువేమి కాదు. సరైన అవకాశం రావాలంతే
కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkatha Night Riders) బౌలింగ్ డిపార్ట్మెంట్ చాల స్ట్రాంగ్ గా ఉంది. పేస్ బౌలింగ్ లో స్పెన్సర్ జాన్సన్, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రానా, నార్జ్, వైభవ్ అరోరా లు ఉండగా నాణ్యమైన వరల్డ్ క్లాస్ స్పిన్నర్ లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్’లు ఉన్నారు. మయాంక్ మర్కండే కూడా మంచి లెగ్ స్పిన్నర్. గుగ్లీ లు వేయగలడు.
కోల్ కతా నైట్ రైడర్స్ కు బ్యాటింగ్, బౌలింగ్, అల్ రౌండర్స్ డిపార్ట్మెంట్ లలో మంచి ఆటగాళ్లే ఉన్నారు. అంతే కాకుండా అనేక రకాల ఆప్షన్స్ కూడా ఉన్నాయి
కాబట్టి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే రజత్ పటిదార్, విరాట్ కోహ్లీ చెలరేగి ఆడితే ఆర్సీబీ ని కూడా తక్కువ అంచనా వేయలేము
ప్రస్తుతం కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల కెప్టెన్ లు ఇద్దరు కొత్త వారే. రహానే టీం తో కలిసి నడిస్తే సరిపోతుంది. రజత్ పటిదార్ టీం తో నడవడం కాకుండా నడిపించాలి. ఇదొక్కటే ఈ రెండు జట్ల మధ్య తేడా
కోల్ కతా లో వర్షం పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఐపీల్ మొదటి మ్యాచ్ వర్షార్పణం అవుతుందా లేదా సజావుగా సాగుతుందా అనేది కొన్ని గంటలలో తేలిపోతుంది

