టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. బ్యూటీ క్వీన్ శ్రీలీల (Sree Leela) కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భీష్మ మూవీ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మువీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్’ (Robinhood) సినిమా మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
అయితే ఈ సినిమా తర్వాత నితిన్ ‘తమ్ముడు’ (Tammudu) సినిమాలో నటిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీని దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. అయితే నితిన్ ‘తమ్ముడు’ మూవీ సెట్స్ మీద ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నితిన్ నేషనల్ ప్లేయర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఎప్పుడూ చూడని వైవిధ్యభరిత కాన్సెప్ట్‌తో ఈ సినిమాని రూపొందించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ‘ఇష్క్’ ఫేమ విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభించాలని భావిస్తున్నారట మేకర్స్. దీని మీద త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ‘రాబిన్ హుడ్’ సినిమా విషయనికోస్తే.. నితిన్ (NIthin) ఇందులో రాబిన్ హుడ్ అనే దొంగ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే రాజేంద్రప్రసాద్ ఏజెంట్ జాన్ స్నో పాత్రలో కనిపించనున్నాడు. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మాతలుకగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు సాయి శ్రీరామ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

