చిరంజీవి ని యూకే పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారం తో సత్కరించడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హర్ష వ్యక్తం చేశారు. మీ తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడు గర్విస్తూనే ఉంటాను అని అన్నారు. చిరంజీవి గారిని ఒక అన్నయ్యగా కాకుండా తండ్రి సమానుడిగా భావిస్తాను. అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను అని పవన్ కల్యాణ్ గారు తన పోస్ట్ లో పేర్కొన్నారు
అంతకు ముందు, చిత్ర పరిశ్రమకు ఆయన అందిస్తున్న విశేష సేవలను గానూ యూకే పార్లమెంట్ చిరుకు జీవిత సాఫల్య పురస్కారాన్ని (Lifetime Achievement Award) అందించింది. తాజాగా యుకే పార్లమెంట్ నుంచి ఈ అరుదైన సత్కారం అందుకున్నారు. చిరంజీవికి యూకే పార్లమెంట్‌లోని గ్రూప్ ఆఫ్ ఎంపీలు కలిసి లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్‌తో సత్కరించారు. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. బ్రిటన్ పార్లమెంటు భవనమైన హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ తో పాటుగా రాజకీయ ప్రముఖులు, సినీతారలు, అభిమానులు పాల్గొన్నారు
గత కొంత కాలంగా చిరంజీవి వరసగా అవార్డులు అందుకుంటున్న సంగతి తెలిసిందే. గతేడాది భారత దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ ను చిరంజీవి అందుకున్నారు. కాగా, సినీ రంగంలో నాలుగు దశాబ్దాలుగా చిరంజీవి అందిస్తున్న సేవలకు ఈ అవార్డు అందించినట్లు యూకే పార్లమెంటు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఈ అవార్డు అందుకునేందుకు చిరంజీవి లండన్ చేరుకోగా.. అక్కడ ప్రవాస భారతీయులు, సినీ ప్రేమికులు ఘనంగా స్వాగతం పలికారు

