ప్రభాస్ ‘ది రాజాసాబ్’.. ఇది కదా సర్​ప్రైజ్ అంటే

by | Mar 20, 2025 | సినిమా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా యంగ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ హారర్‌ చిత్రం ‘ది రాజాసాబ్‌’. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘కల్కి’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత ప్రభాస్‌ నుంచి రానున్న సినిమా ఇదే కావడంతో భారీ హైప్‌ నెలకొంది. హార్రర్ కామెడీ జోనర్‌లో వస్తున్న రాజాసాబ్​ (Raja Saab)సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం వైరల్​గా మారింది.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ చిత్ర బృందం ప్రభాస్ (Prabhas) సాలిడ్ సర్​ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీజర్​తో అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. ఉగాది కానుకగా కానీ లేదంటే ఏప్రిల్ మొదటి వారంలోనైనా టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం చిత్రబృందం ఇప్పటికే సాలిడ్ టీజర్ కట్ చేయగా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వర్క్స్ జరుగుతున్నాయని తెలిసింది. కాగా, రాజాసాబ్‌ చిత్రాన్ని 2025 ఏప్రిల్‌ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించగా.. ప్రస్తుతం సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తున్నది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏదేమైనా చాలా రోజుల తర్వాత ‘ది రాజా సాబ్‌’ (Raja Saab) సినిమా నుంచి టీజర్ రాబోతుందన్న సమాచారంతో ప్రభాస్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.