‘కింగ్​డమ్​’ కోసం మరో టాలెంటెడ్ హీరో!

by | Mar 17, 2025 | సినిమా

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడుగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్​డమ్​'(Kingdom). ఇందులో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍ గా నటిస్తోండగా.. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో విజయ్‌ దేవరకొండ కనిపిస్తారని తెలిసింది. అలాగే విజయ్‌ దేవరకొండ క్యారెక్టరైజేషన్‌లో విభిన్న కోణాలు ఉంటాయట. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో విలక్షణ నటుడు, టాలెంటెడ్ ఆర్టిస్ట్ సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం.

ఈ మూవీలో ఆయన విజయ్ దేవరకొండకు (Vijaya Devarakonda) అన్నయ్య పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. దింట్లో ఆయనది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అని, సినిమాలో ఈ పాత్రకు చాలా ప్రాధాన్యముందని ఈ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని తెలుస్తోంది. ఇక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన సత్యదేవ్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సంపాదించుకున్నారు. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్‌ను ఖాతాలో వేసుకుంటున్నాడు సత్యదేవ్‌. కాగా, భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 30న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా టైటిల్, టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా, అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది.