నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కోర్ట్’. స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రశాంతి త్రిపిరినేని నిర్మించారు. హొలీ పండుగ కానుకగా మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అదిరిపోయే టాక్‌ను దక్కించుకుంది. అయితే ఇది చిన్న సినిమానే అయినప్పటికి మొదటి రోజు మంచి ఓపెనింగ్స్‌ను అందుకుంది. ఇక ఈ సినిమాకు మొదటి నుంచి కాస్త గట్టిగానే ప్రమోషన్స్ చేశారు. హీరో నానిని (Nani) కూడా బాగానే ఉపయోగించుకున్నారు. టీజర్, ట్రైలర్ కూడా అభిమానుల్ని ఆకట్టుకుంది. దీంతో కోర్ట్ మూవీపై హైప్ పెరిగింది. అందుకు తగ్గట్టే ఫస్ట్ షో నుంచే మంచి స్పందనను అందుకుంది. ప్రియదర్శి, శివాజీ నటనే సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని రివ్యూలు వచ్చాయి.
ఈ క్రమంలోనే కోర్ట్ (Court) మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.8.10 కోట్లు వసూలు చేసింది. అయితే దాదాపు రూ. 11 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించగా.. మొదటిరోజు బ్రేక్‌ఈవెన్‌కు దగ్గరలో వసూళ్లు రావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. కోర్ట్ సినిమాకు ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 8 కోట్లు, ఆడియో ద్వారా రూ. 50 లక్షలు, శాటిలైట్ ద్వారా రూ. 2 కోట్లు వచ్చాయని సమాచారం. అలాగే ఓవర్సీస్లోనూ సాలిడ్ కలెక్షన్స్‌ను అందుకుంటోందని తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో ఈ సినిమాకు వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. పైగా వీకెండ్ కూడా సినిమాకు బాగా కలిసి రావొచ్చు. మొత్తానికి ఫస్ట్ డే సాలిడ్ ఓపెనింగ్ రాబట్టిన ఈ సినిమా ఈ వీకెండ్ ముగిసే నాటికి భారీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. కాగా, ఇందులో శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.

