ఛాంపియన్స్ ట్రోఫీ ని గెలిచిన ఆనందం లో యావత్ భారత దేశం ఉంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ మీద మాట్లాడిన వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అట్లుంటది మా రోహిత్ శర్మ తో
ఇప్పటికే టి 20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ఏప్రిల్ 30 న 39 వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సమయంలో రోహిత్ శర్మ ముందున్న లక్ష్యాలు ఏంటో చూద్దాం
ఒక్కో తరం లో ఒక్కో నాయకుడు వస్తాడు. ఒక తరంలో ఒక్కో అసమాన క్రికెటర్ వస్తాడు బాధ్యతలను భుజాలకెత్తుకోవడానికి
కపిల్ దేవ్ నేతృత్వంలో 1983 ప్రపంచ కప్ గెలిచినప్పుడు శ్రీకాంత్, మొహిందర్ అమర్నాధ్ లు ఉన్నారు
2011 లో ధోని నేతృత్వంలో భారత జట్టు ప్రపంచ కప్ గెలిచినప్పుడు సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లు ఉన్నారు. ఏం ఎస్ ధోని నాయకత్వంలో 2007 ఐసీసీ టి 20 వరల్డ్ కప్, 2011 లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, 2013 లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లను గెలుచుకుంది. క్రికెట్ చరిత్రలోనే, మూడు రకాల ఐసీసీ ట్రోఫీలను గెలిచిన ఏకైక కెప్టెన్ ఏం ఎస్ ధోని. ధోని నాయకత్వంలో నాలుగు సార్లు ఐసీసీ ట్రోఫీ ఫైనల్ కు చేరితే మూడు సార్లు కప్ గెలిచారు. ఫైనల్ కు చేరిన మొదటి మూడు సార్లు కప్ గెలిచారు. నాలుగో సారి , 2014 టి 20 వరల్డ్ కప్ ఫైనల్ లో మాత్రం శ్రీ లంక చేతిలో ఓడి పోయారు
ఇప్పుడు ఈ తరం లో రోహిత్ శర్మ వచ్చాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ లే కాకుండా జట్టులో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవలేదు
ఇప్పటికే రోహిత్ శర్మ నాయకత్వంలో, భారత జట్టు 2024 ఐసీసీ టి 20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ లను గెలుచుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలో నాలుగు సార్లు ఐసీసీ ట్రోఫీ లో ఫైనల్ కు వచ్చింది. ధోని తరవాత, భారత జట్టును, ఐసీసీ ట్రోఫీ ఫైనల్ కు నాలుగు సార్లు తీసుకు వచ్చిన ఘనత రోహిత్ శర్మదే.
ఇప్పుడు ఇక రోహిత్ శర్మ లక్ష్యం ఏంటి 2027 దక్షిణ ఆఫ్రికా, నమీబియా, జింబాబ్వే లు వేదికగా జరగబోయే వరల్డ్ కప్.
అప్పటికి రోహిత్ శర్మ 40 లోకి వస్తాడు కాబట్టి, ఆ కప్ గెలవడం రోహిత్ కు చాలా అవసరం. 2027 వరల్డ్ కప్ గెలిస్తే రోహిత్ శర్మ ధోని సరసన నిలుస్తాడు కాదు ధోనిని దాటేస్తాడు
అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ కూడా ఈ జూన్ లో ఇంగ్లాండ్ తో మొదలయ్యే టెస్ట్ సిరీస్ తో మొదలవుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా 2027 లోనే ఉంటుంది. ఈ రెండింటిని గెలించి చరిత్రలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకోవచ్చు రోహిత్ శర్మ. 2027 లో ప్రపంచ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలిచి సీనియర్ ఆటగాళ్లు అయినా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు ఆటకు గుడ్ బై చెప్పవచ్చు
అయితే అంత సులువు కాదు. కానీ రోహిత్ శర్మ ఫిట్ నెస్ కాపాడుకుంటూ బ్యాటింగ్ లయ తప్పకుండా చూసుకుంటే, రోహిత్ శర్మ సారధ్యంలో ఈ రెండు ఐసీసీ ట్రోఫీ లను (2027 ప్రపంచ కప్ మరియు 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్) భారత జట్టు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
కపిల్ దేవ్, ధోని, రోహిత్ శర్మ ల తరవాత వచ్చే తరం నాయకుడు ఎవరో ? ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుణ్యమా అని భారత జట్టులో చాలా మందికి కెప్టెన్సీ అనుభవం వచ్చేసింది. అయితే భారత జట్టును జాతీయ స్థాయిలో నడిపించగలిగే మొనగాడు ఎవరో తెలియాలి

